పోక్సో కేసులో నిందితుడికి పదేండ్ల జైలు శిక్ష 

పోక్సో కేసులో నిందితుడికి పదేండ్ల జైలు శిక్ష 

నిర్మల్, వెలుగు: పోక్సో కేసులో ఓ నిందితుడికి పదేండ్ల జైలు శిక్ష విధిస్తూ నిర్మల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు గురువారం తీర్పునిచ్చింది. కుంటాల మండలంలోని ఓ గ్రామానికి చెందిన శ్రీకాంత్ అదే గ్రామానికి చెందిన బాలుడు(14) తో లైంగికంగా, అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో శ్రీకాంత్​పై స్థానిక పోలీస్ స్టేషన్​లో 2016 లో కేసు నమోదైంది.

 పోలీసులు దర్యాప్తు చేపట్టి విచారించారు. నేరం రుజువు కావడంతో ఫాస్ట్ ట్రాక్ కోర్టు పోక్సో చట్టం కింద నిందితునికి 10 సంవత్సరాల జైలు శిక్ష, రూ.4 వేల జరిమానాల విధిస్తూ తీర్పు వెలువరించారు.