బ్యాంకుల రాయితీలను రైతులు వినియోగించుకోవాలి : బ్యాంకు మేనేజర్ రాంగోపాల్

బ్యాంకుల రాయితీలను  రైతులు వినియోగించుకోవాలి : బ్యాంకు మేనేజర్ రాంగోపాల్

నిర్మల్, వెలుగు: బ్యాంకులు అందించే పథకాలు, రాయితీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని నిర్మల్ ​జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ రాంగోపాల్ సూచించారు. తెలంగా ణ గ్రామీణ బ్యాంకు ఆధ్వర్యంలో బుధవారం రైతు ఉత్పత్తిదారుల సంఘం, బ్యాంకు, వ్యవసాయ శాఖల అధికారులు సంయుక్తంగా జిల్లా కేంద్రంలోని ప్రాంతీయ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల అభివృద్ధికి తోడ్పడేందుకు బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. 

బ్యాంకులకు వెళ్లి ప్రభుత్వాలు తమకు అందించే పథకాలు, రాయితీల గురించి వివరాలు అడిగి తెలుసుకోవాలన్నారు. బ్యాంక్ అధికారులు సైతం గ్రామాల్లో రైతులకు ప్రభుత్వ పథకాలు, రుణాలపై అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంజిప్రసాద్, టీజీబీ ప్రాంతీయ మేనేజర్ నవీన్ కుమార్, మేనేజర్ విలాస్, నాబార్డ్​ డీడీఎం వీరభద్రుడు, ఇతర అధికారులు పాల్గొన్నారు.