- గతంలో అవినీతి, అవకతవకలకు పాల్పడ్డాడని ఫిర్యాదులు
నిర్మల్, వెలుగు: వెహికల్ఇన్య్సూరెన్స్డబ్బు క్లెయిమ్ కేసు దర్యాప్తుతో పాటు అనేక అవకతవకలకు పాల్పడ్డాడన్న ఆరోపణలు రావడంతో అప్పటి నిర్మల్ రూరల్ ఎస్.ఐ కె.చంద్రమోహన్ ను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్–1 ఐజీపీ ఏ.వి.రంగనాథ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. చంద్రమోహన్ ప్రస్తుతం నిర్మల్ టౌన్ ఎస్ఐగా ఉన్నారు. నిర్మల్ రూరల్ పీఎస్పరిధిలో గత నెల ఫిబ్రవరి 2న ఒక రోడ్డు ప్రమాదం జరిగింది.
ఈ కేసులో ఇన్స్యూరెన్స్ సొమ్ముకు సంబంధించి ఎస్సై చంద్రమోహన్ అవకతవకలకు పాల్పడినట్లు పోలీసు శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. నిర్మల్ రూరల్‌పోలీస్‌స్టేషన్ తర్వాత చంద్రమోహన్ సారంగాపూర్‌కు బదిలీ కాగా అక్కడ కూడా జూద గృహాలను ప్రోత్సహించారని ఆరోపణలు వచ్చాయి. అవకతవకలకు కూడా పాల్పడ్డట్టు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో పోలీసు అధికారులు విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు. ఆరోపణలు నిజమేనని తేలడంతో సస్పెండ్ చేశారు.