త్వరగా ఐటీ అసెస్ మెంట్ కావాలి

త్వరగా ఐటీ అసెస్ మెంట్ కావాలి

న్యూఢిల్లీ: ట్యాక్స్​పేయర్లకు మరింత సమర్థంగా సేవలను అందించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఐటీ శాఖను కోరారు. పన్ను రిటర్నులను త్వరగా లెక్కించి, రీఫండ్స్​ను మరింత వేగంగా ప్రాసెస్ చేయాలని సూచించారు. పెండింగ్ ఫిర్యాదులను పరిష్కరించాలని ఆదాయపు పన్ను శాఖకు స్పష్టం చేశారు. ఈ మూడు సూత్రాలను తప్పకుండా పాటించాలన్నారు.  ఈ పనులను మరింత మెరుగ్గా చేస్తే శాఖకు మరింత మంచి జరుతుందని అన్నారు.  సమర్థంగా సేవలు అందించిన అధికారులకు అవార్డుల అందజేసిన సందర్భంగా ఆమె ఈ కామెంట్స్​ చేశారు. ‘‘మీరు మూడు రూల్స్​.. అంటే ‘ఆర్​’లను పాటించాలి. మొదటి ఆర్.. పన్ను రిటర్నులను త్వరగా, సమర్ధవంతంగా  క్రమపద్ధతిలో అంచనా వేయాలి. వేగంగా  ప్రాసెస్ చేయాలి.

రెండవ ఆర్...​ వేగంగా  రీఫండ్ రావాలి. ఈ విషయంలో మీరు చాలా బాగా చేస్తున్నారు. రీఫండ్లను త్వరగా ఇచ్చేందుకు మరింత శ్రద్ధ చూపాలి.  సాకులు చెప్పకూడదు. వీటిని మరింత సమర్థవంతంగా ప్రాసెస్  చేయడం వల్ల డిపార్ట్‌‌మెంట్‌‌కు మరింత మంచి పేరు ఉంటుంది. చివరిగా మూడవ ఆర్... ఫిర్యాదుల పరిష్కారం. నేటికీ కొన్ని కేసులు పెండింగ్‌‌లో ఉన్నాయి. కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు.  ‘అయితే’లు, ‘కానీ’లు వచ్చిన సందర్భాలు కావచ్చు. తుది అధికారం మీదే! వీలుంటే వాటిని సకాలంలో పరిష్కరించాలి లేదా దీనికి చాలా సమయం పడుతుందని ముందుగానే చెప్పాలి. మీ అధికార పరిధిలో లేనట్లయితే అదే విషయాన్ని వివరించాలి”అని మంత్రి అన్నారు.