వడ్డీ లేని రుణాలకు రూ.13.7లక్షల కోట్లు.. రైల్వేకు 2.4లక్షల కోట్లు

వడ్డీ లేని రుణాలకు రూ.13.7లక్షల కోట్లు.. రైల్వేకు 2.4లక్షల కోట్లు

రాష్ట్రాలకు వడ్డీలేని రుణాల పథకం మరో ఏడాది పొడిగిస్తున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. రాష్ట్రాలకు వడ్డీ లేని రుణాల పథకం కోసం రూ.13.7లక్షల కోట్లు కేటాయిస్తున్నామని అన్నారు. రైల్వేకు రూ.2.4లక్షల కోట్లు ఇస్తున్నామని తెలిపారు.  2013-14తో పోలిస్తే రైల్వేలకు 9 రేట్ల నిధులు కేటాయించామన్నారు. ‘పట్టణ మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక నిధుల కింద ఏటా రూ.10 వేల కోట్లు. పీఎం ఆవాస్ యోజనకు రూ.79 వేల కోట్లు. కీలకమైన వంద మౌలిక వసతుల ప్రాజెక్టులకు రూ.75 వేల కోట్లు. మూలధన వ్యయాలు మొత్తం రూ.10 లక్షల కోట్లు కేటాయిస్తున్నాం’ అని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.