భీష్మ టీజర్: ఏంట్రా సరసాలాడుతున్నవ్

V6 Velugu Posted on Jan 12, 2020

వెంకీ కుడుముల డైరెక్షన్ లో నితిన్ హీరోగా నటించిన సినిమా భీష్మ. నితిన్ సరసన రష్మిక హీరోయిన్ గా నటించిన ఈ మూవీ అఫీషియల్ టీజర్ ఆదివారం రిలీజ్ చేసింది యూనిట్. నిమిషం ఆరు సెకన్లున్న ఈ టీజర్ లో నితిన్ ఫన్నీ డైలాగ్స్ తో అదరగొట్టాడు. రష్మిక, నితిని కెమిస్ట్రీ బాగుంది. “ మీ తర్వాత మీ ఆస్తిని ఇంతపెద్ద కంపెనీని మీ ఆలోచనలకు అనుకూలంగా చూసుకునేది ఎవరు సార్. నా పేరు ముందు సార్ అని యాడ్ చేస్తే బాగోదని. భీష్మ IAS  అనే డైలాగ్స్ నితిన్ చెప్పగా.. స్పీడ్ గా వెళ్లే స్కూటర్ కు మేకు గుచ్చకున్నట్లు నువ్వు నాకు గుచ్చుకున్నావేంట్రా అని వెన్నల కిషోర్ నితిన్ తో అంటాడు. ఏంట్రా సరసాలాడుతున్నవ్ అని రష్మిక అంటుంది.

నా అదృష్ట ఆవ గింజంత ఉంటే దురదృష్ఠం దెబ్బకాయంత ఉందండి. ఎవరి వాల్యూ అయినా బతికున్నప్పటి కంటే చనిపోయినప్పుడే పెరుగుతుంది బయ్యా. ఎలాగంటే ఓ కోడి బతికున్నప్పుడు కిలో 90 రూపాయలు..అది చనిపోయాకా 190 రూపాయలంటూ” క్లైమాక్స్ లో నితిన్ చెప్పే డైలాగ్స్ నవ్వులు పూయిస్తున్నాయి. ఇప్పటికే రిలీజైన ఈ మూవీ పోస్టర్స్ ఆకట్టుకోగా..ఇవాళ వచ్చిన టీజర్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచిందంటున్నారు ఫ్యాన్స్. భీష్మ టీజర్ ను ట్వట్టర్ లో పోస్ట్ చేసి ఫ్యాన్స్ తో సంతోషాన్ని పంచుకున్నాడు హీరో నితిన్. “ఈ సినిమాలో సూపర్ ఫన్ గ్యారంటీ” అని ట్వీట్ చేశాడు. సితార ఎంటర్టయిన్స్ మెంట్ పై తెరకెక్కిన ఈ మూవీ ఫిబ్రవరి 21న రిలీజ్ కానుంది.

 

Tagged teaser, bheeshma, Rashmika Mandanna, Nithiin

Latest Videos

Subscribe Now

More News