Nithiin-Aditya Hasan: యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్తో నితిన్!..హిట్ కన్ఫమ్ భయ్యా

Nithiin-Aditya Hasan: యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్తో నితిన్!..హిట్ కన్ఫమ్ భయ్యా

90’s మిడిల్ క్లాస్ బయోపిక్(#90's A middle class biopic) వెబ్ సిరీస్ ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ప్రతేకంగా చెప్పాల్సిన పనిలేదు. దర్శకుడు ఆదిత్య హాసన్(Adithya Haasan) తెరకెక్కించిన ఈ సిరీస్ లో శివాజీ(Shivaji), వాసుకి ఆనంద్ సాయి(Vasuki Anand Sai), మౌళి(Mouli), రోహన్ రాయ్(Rohan Roy) ప్రధాన పాత్రల్లో నటించారు.

ప్రముఖ ఓటీటీ ఛానెల్ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అయిన ఈ సిరీస్ సూపర్ సిక్స్ అయ్యింది. ఫ్యామిలీ, కామెడీ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులకు ఫిదా అయ్యారు.

90’s మిడిల్ క్లాస్ వెబ్ సిరీస్ తో మంచి గుర్తింపు దక్కించుకున్న ఆదిత్య హాసన్ కు..ఆ వెంటనే రాజమౌళి కాంపౌండ్ నుంచి అవకాశం దక్కింది. అదే గిరీశ్ ఏడీ దర్శకత్వం వహించిన ప్రేమలు తెలుగు వెర్షన్‍.ఈ రీమేక్కు ఆదిత్య హాసన్ డైలాగ్స్ అందించారు.అతడు రాసిన డైలాగ్స్ ట్రెండ్‍కు తగ్గట్టు ఆడియన్స్ ను భలే ఆకట్టుకున్నాయి. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అందుకుంది. 

తాజా విషయానికి వస్తే డైరెక్టర్ ఆదిత్య హాసన్..యంగ్ హీరో నితిన్(Nithiin)తో తన నెక్స్ట్ సినిమా చేయబోతున్నట్లు సమాచారం.నితిన్ కూడా ఈ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ తో వర్క్ చేయడానికి ఇంట్రెస్టింగ్ తో ఉన్నాడట.ఈ సినిమాను హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారట.

90’sవెబ్ సీరీస్,ప్రేమలు ఈ రెండు సినిమాల్లో ఆదిత్యా హాసన్ నుంచి వచ్చిన సీన్స్, కామెడీ పంచ్ లు ఆడియన్స్ కి భలే ఇంపాక్ట్ ఇచ్చాయి. అందువల్ల చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న నితిన్ కు..ఆదిత్య హాసన్ కామెడీ ఇచ్చే బలం..ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని బలంగా ఫిక్స్ అయ్యాడట. ఎందుకంటే నితిన్ కు తన బలం కూడా కామెడీ కాబట్టి. త్వరలో ఈ ఇంట్రెస్టింగ్ కాంబో నుంచి ఆఫీసియల్ అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉంది. 

ప్రస్తుతం నితిన్ ఛలో ఫేమ్ వెంకీ కుడుములతో రాబిన్ హుడ్ సినిమా చేస్తున్నాడు. అలాగే వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ తో తమ్ముడు మూవీలో నటిస్తున్నాడు. ఈ రెండు ప్రాజెక్ట్స్ పూర్తి కాగానే ఆదిత్యా హాసన్ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నాడు నితిన్. మరి ఆదిత్య ఎలాంటి స్క్రిప్ట్ తో వస్తాడో చూడాలి.