Oppenheimer OTT: OTTకి వచ్చిన ఓపెన్హైమర్ తెలుగు వర్షన్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Oppenheimer OTT: OTTకి వచ్చిన ఓపెన్హైమర్ తెలుగు వర్షన్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్(Christopher Nolan) నుండి వచ్చిన లేటెస్ట్ మూవీ ఓపెన్హైమర్(Oppenheimer ). అణుబాంబు పితామహుడు  ఓపెన్ హైమర్ జీవిత ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో సిల్లియన్ మర్ఫీ(Cillian Murphy) ప్రధాన పాత్రలో నటించారు. కాదు.. కాదు.. జీవించారు అని చెప్పాలి. అయితే భారీ అంచనాల మధ్య గత డిసెంబర్ లో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఇక ఇటీవల జరిగిన 96వ ఆస్కార్ వేడుకుల్లో ఓపెన్హైమర్ సినిమా ఏనగా ఏడు విభాగాలలో అవార్డులను అందుకొని హిస్టరీ క్రియేట్ చేసింది. 

ఇక ఇటీవలే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చింది. అయితే ఇంగ్లీష్ తో పాటు హిందీ, కన్నడ, మలయాళీ, తమిళ భాషల్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఈ సినిమాలో తాజాగా తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమయింది. నిజానికి ఈ సినిమా తెలుగు వర్షన్ కోసం చాలా మంది ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. వారి ఎదురుచూపులు ఎండు కార్డు వేస్తూ.. జియో సినిమా ఓపెన్హైమర్ తెలుగు వర్షన్  ను స్ట్రీమింగ్ చేస్తోంది. ఈ విషయం తెలుసుకున్న తెలుగు ఆడియన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరి మీలో కూడా క్రిస్టోఫర్ నోలన్ అభిమానులు ఉంటే ఈ సినిమా చూశేయండి.  

Also Read : యాక్షన్ లవర్స్ గెట్ రెడీ.. బడే మియా చోటే మియా ట్రైలర్ డేట్ ఫిక్స్