
తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తామన్నారు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ. ఆదిలాబాద్ లో పర్యటించిన ఆయన.. స్మార్ట్ సీటీలు కాదు...స్మార్ట్ విలేజ్ లను తీర్చి దిద్దుతున్నామని చెప్పారు. వచ్చే నాలుగేళ్లలో తెలంగాణలో రెండు లక్షల కోట్లు ఖర్చు చేస్తామన్నారు. గ్రీన్ ఎనర్జీ కోసం రాబోయే రోజుల్లో లక్ష కోట్లు ఖర్చు చేస్తామని చెప్పారు. గడ్చిరోలీ జిల్లాలో అనేక అభివృద్ది కార్యక్రమాలు చేశామన్నారు. రైతులు ఆత్మహత్యచేసుకున్న విదర్భలో తాము పనిచేశామని చెప్పారు. చీకటి ఉండే చోట వెలుగులు నింపాలన్నారు.
వెనుకబడిన జిల్లాలో అభివృద్ధి కోసం మేం పనిచేస్తున్నాం. అమృత్ సరోవర్ పేరుతో నీటి నిల్వలు పెంచుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే మేం నీటి నిల్వలు పెంచేందుకు సిద్ధం. తెలంగాణలో కూడా అలా నీటి సరస్సులను గుర్తిస్తే మేం అభివృద్ధి చేస్తాం . మీ సమస్యలను అర్థం చేసుకునే అవకాశం వచ్చింది. రోడ్డు బాగుంటేనే అమెరికా ధనిక దేశం అయింది. తెలంగాణలో కూడా రోడ్లు బాగుంటేనే ధనిక రాష్ట్రం అవుతుంది
Also Read : కోమటిరెడ్డి బోళా మంత్రి .. ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతరు
నీరు, ఇంధనం, రవాణా, కమ్మునికేషన్, ఏఐతో ఏ ప్రదేశమైనా అభివృద్ధి జరుగుతోంది. .శ్రీనగర్, జమ్మూలో36 టన్నెల్స్ నిర్మిస్తున్నాం. ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందించడమే మా ప్రభుత్వ లక్ష్యం, ఆర్ఎస్ఎస్ లో ఉన్నప్పుడు ఆదివాసీలతో కలిసి పనిచేశాం. యువకులకు ఉద్యోగాలు, రైతులకు మధ్దతు ధర దక్కాలి. జగిత్యాల వరంగల్ హైవేకు రూ.1000 కోట్లు కేటాయించాం అని నితిన్ గడ్కర అన్నారు.