
సాధారణంగా సినిమాలపై జరిగే కాంట్రావర్సీల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. సినిమాలోని సన్నివేశాల వల్ల, సాంగ్స్, డైలాగ్స్ వల్ల కొంతమంది మనోభావాలు దబ్బతినడం, వాళ్ళు వాటికి వ్యతిరేకంగా ఆందోళనలు చేయడం జరుగుతూనే ఉంటుంది. వాటిపై మూవీ మేకర్స్ స్పందించడం, సారీలు చెప్పడం అనేవి జరుగుతూనే ఉంటుంది.
తాజాగా ఇలాంటి కాంట్రావర్సీనే నితిన్ హీరోగా వచ్చిన ఎక్స్‌ట్రా ఆర్డినరీమ్యాన్ మూవీ విషయంలో జరిగింది. దీనిపై తమిళ సినీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. దీంతో హీరో నితిన్ స్పందించి క్లారిఫై ఇచ్చారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. ఎక్స్‌ట్రా ఆర్డినరీమ్యాన్ సినిమాలో ఒక సన్నివేశం తండ్రి రావు రమేష్ చెప్పిన డైలాగ్ అర్థంకాక నితిన్.. నువ్వు చెప్పేది పొన్నియిన్ సెల్వన్ సినిమాలా అర్థం కావడం లేదు నాన్న.. అని అంటాడు.
ఇదిగో ఈ డైలాగే తమిళ ఆడియన్స్ ను, మరీ ముఖ్యంగా దర్శకుడు మణిరత్నం ఫ్యాన్స్ ను ఆగ్రహానికి గురి చేసింది. ఈ డైలాగ్ ను ట్యాగ్ చేస్తూ.. అంటే పొన్నియిన్ సెల్వన్ ఎవరికీ అర్థం కాలేదని మీ ఉద్దేశమా.. అంత ప్రతిష్టాత్మక సినిమా గురించి అలా ఎలా కామెంట్స్ చేస్తారు అంటూ.. ఫైర్ అవుతున్నారు. అంతేకాదు వెంటనే సినిమా నుండి ఆ డైలాగ్ ను తొలగొంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయంపై హీరో నితిన్ స్పందించారు... మనం చాలా జాగ్రత్తగా గమనిస్తూ చూస్తేనే పొన్నియిన్ సెల్వన్ సినిమా అర్థమవుతుంది. ఎందుకంటే.. ఆ సినిమాలో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. అందుకే ఆ డైలాగ్ పెట్టాము తప్పా.. ఎంమారె ఉద్దేశము లేదు.. అని క్లారిటీ ఇచ్చాడు నితిన్.