
నితిన్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. శ్రేష్ఠ్ మూవీస్, ఆదిత్య మూవీస్, రుచిర ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. ‘ఎక్స్‌ట్రా’ టైటిల్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు ఆదివారం రివీల్ చేశారు. ‘ఆర్డినరీ మ్యాన్’ అనేది ట్యాగ్‌లైన్. ఈ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్‌లో నితిన్ రెండు డిఫరెంట్ లుక్స్‌లో కనిపిస్తున్నాడు.
ఒక దానిలో ఒత్తుగా జుట్టు, గడ్డం పెంచి సీరియస్ లుక్‌లో కనిపిస్తుండగా, మరో గెటప్‌లో జీన్స్, టీ షర్ట్‌తో స్టైలిష్‌గా ఉన్నాడు. నితిన్‌కి ఇది 32వ చిత్రం. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం 60 శాతం షూటింగ్ పూర్తయిందని తెలియజేశారు మేకర్స్. అలాగే క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 23న సినిమా రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. హరీష్ జైరాజ్ సంగీతం అందిస్తున్నాడు. ఆడియెన్స్‌కి రోలర్ కోస్టర్‌లాంటి ఎక్స్‌పీరియెన్స్‌నిస్తూ నవ్విస్తూనే ట్విస్టులతో సర్‌ప్రైజ్ చేస్తుంది అని దర్శకుడు వక్కంతం వంశీ చెప్పాడు.