
టాలెంటెడ్ నటి నిత్యా మీనన్ తమిళ ఇండస్ట్రీపై సంచలన కామెంట్స్ చేశారు. కోలీవుడ్ ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరో తనను వేధించాడని, దాని వాళ్ళ తాను చాలా ఇబ్బంది పడ్డానని చెప్పి అందరికీ షాకిచ్చింది ఈ బ్యూటీ. దీంతో తమిళ ఇండస్ట్రీలో ఇది హాట్ టాపిక్ గా మారింది.
ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. నిత్య మీనన్ ప్రస్తుతం కుమారి శ్రీమతి అనే వెబ్ సిరీస్ చేస్తోంది. గోమతేష్ ఉపాధ్యాయే దర్శకత్వంలో వస్తున్న ఈ సిరీస్ సెప్టెంబర్ 28 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ నుంచి ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోగా.. సిరీస్ కోసం ఆడియాన్స్ ఎదురుచూస్తున్నారు.
ఈ సిరీస్ ను స్వప్న సినిమాస్ పై స్వప్న దత్ నిర్మించారు. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్. ఇందులో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిత్యామీనన్ కోలీవుడ్ ఇండస్ట్రీ గురించి సంచలన కామెంట్స్ చేశారు.. కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఓ స్టార్ హీరో నన్ను వేధించాడు.. తమిళ్ సినీ ఇండస్ట్రీ వల్ల నేను చాలా ఇబ్బందులను పడ్డాను.. అని చెప్పారు నిత్యా. ప్రస్తుతం నిత్య చేసిన ఈ కామెంట్స్ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.