వరుణ్ పెళ్లి కోసం నితిన్ బస్సు.. వైరల్ అవుతున్న ఫోటో

వరుణ్ పెళ్లి కోసం నితిన్ బస్సు.. వైరల్ అవుతున్న ఫోటో

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi)ల పెళ్లి నవంబర్ 1న ఇటలీలో గ్రాండ్ గా జరుగనుంది. ఈ పెళ్లి కోసం మెగా ఫ్యామిలీ అంతా ఇప్పటికే ఇటలీకి(Italy) చేరుకున్నారు. పెళ్ళికి ఒకరోజు మాత్రమే ఉండటంతో పెళ్లి పనులు కూడా పూర్తి చేశారు. ఈ పెళ్లి వేడుకకు మెగా ఫ్యామిలీ తోపాటు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరవుతున్నారు.

ఆ లిస్టులో టాలీవుడ్ హీరో నితిన్ కూడా ఉన్నాడు. తాజాగా ఈ హీరో వరుణ్ పెళ్ళికి తన ఫ్యామిలీతో సహా బస్సు వేసుకొని వెళ్తున్నాడు. నితిన్ ప్రస్తుతం తన నెక్స్ట్ మూవీ ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ షూట్ కోసం ఇటలీకి ఉన్నాడు. అక్కడ నితిన్ తోపాటు తన భార్య, అక్క, బావ, ప్రముఖ డిజైనర్ నీరజ కోన కూడా ఉన్నారు. వీరంతా ఓ బస్ మాట్లాడుకొని వరుణ్ పెళ్లికి వెళ్తున్నారు. ఆ బస్ ముందు నితిన్ ఫోటో దిగగా..  ఆ ఫోటోని నితిన్ బావ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.