నా టార్గెట్​...దిగుమతుల తగ్గింపు : నితిన్​ గడ్కరీ

నా టార్గెట్​...దిగుమతుల తగ్గింపు : నితిన్​ గడ్కరీ

పణజీ: ఎగుమతులు పెంచడం,  దిగుమతులను తగ్గించడం తన లక్ష్యమని కేంద్ర  కేంద్ర రోడ్డు రవాణా,  రహదారుల శాఖ మంత్రి మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. పెట్రోల్ లేదా డీజిల్ చుక్క దిగుమతి చేసుకోనప్పుడే భారతదేశానికి కొత్త స్వేచ్ఛ వచ్చినట్టని కామెంట్​ చేశారు. గోవా రాజధాని పణాజీలో ఆదివారం జరిగిన 'సాగర్ మంథన్ 2.0' కార్యక్రమంలో ప్రసంగిస్తూ పెట్రోల్,  డీజిల్ దిగుమతిని నిలిపివేయడం ద్వారా ప్రపంచంలోని ఉగ్రవాదాన్ని అడ్డుకోవచ్చని అన్నారు. 

‘‘ఈ దిగుమతులు ఆగనంత వరకు ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం ఆగదు. పెట్రోల్, డీజిల్ దిగుమతిని ఆపడమే నా జీవిత లక్ష్యం. ఒక్క చుక్క పెట్రోల్, డీజిల్ కూడా దిగుమతి కానప్పుడు అది భారతదేశానికి కొత్త స్వేచ్ఛగా భావిస్తున్నాను. పెట్రోల్, డీజిల్ దిగుమతి బిల్లు ఇప్పుడు రూ. 16 లక్షల కోట్లుగా ఉంది. ఈ దిగుమతులను తగ్గిస్తే మనం ఆదా చేసే సొమ్ము పేదలకు చేరుతుంది”అని అన్నారు.