జేడీయూ ఎఫెక్ట్ : రాజ్యసభలో మెజార్టీ కోల్పోయిన ఎన్డీయే

జేడీయూ ఎఫెక్ట్ : రాజ్యసభలో మెజార్టీ కోల్పోయిన ఎన్డీయే

రాజ్యసభలో ఎన్డీయే మెజార్టీ తగ్గింది. బీజేపీతో జేడీయూ తెగతెంపులు చేసుకోవడంతో వైదొలగడంతో రాజ్యసభలో దాన్ని బలం తగ్గింది. జేడీయూకు రాజ్యసభలో వైస్ చైర్మన్ సహా ఐదుగురు సభ్యుల బలం ఉంది. జేడీయూ పొత్తు పెట్టుకునే సమయానికి కూడా ఎగువ సభలో ఎన్డీయేకే మెజార్టీ లేదు. రాజ్యసభలో ప్రస్తుత సభ్యుల సంఖ్య 237 కాగా..ఎనిమిది ఖాళీలున్నాయి. జమ్మూ కశ్మీర్ నుంచి నాలుగు, త్రిపుర నుంచి ఒకటి, మూడు నామినేటెడ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

అయితే ఎగువసభలో మెజార్టీ మార్క్ 119 కాగా ప్రస్తుత బీజేపీకి 110 సభ్యుల బలం మాత్రమే ఉంది. శీతాకాల సమావేశాలకు ముందు ప్రభుత్వం మరో ముగ్గురు ఎంపీలను నామినేట్ చేసే అవకాశాలున్నాయి. అదేవిధంగా ఎన్నికలు ఎప్పుడు వచ్చిన త్రిపుర స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకునే అవకాశం లేకపోలేదు. అప్పుడు ఎన్డీయే బలం 114 మాత్రమే ఉంటుంది. కాబట్టి కీలకమైన బిల్లుల ఆమోదానికి వైసీపీ లేదా బీజేడీ మద్ధతు అవసరం ఉంటుంది. 

కాగ గత మూడేళ్లలో ఎన్డీయే కూటమి నుంచి మూడు పార్టీలు  బయటకు వచ్చాయి. శివసేన, శిరోమణి అకాలీదళ్ 2019 ఎన్నికలకు ముందు టీడీపీ బయటకు వచ్చాయి. తాజాగా జేడీయూ కూడా బయటకు రావడంతో ఆ సంఖ్య నాలుగుకు చేరింది. అయితే రాష్ట్రపతి ఎన్నికల్లో మాత్రం ఎన్డీయే కూటమికి బీజేడీ, వైసీపీ, శిరోమణి అకాలీదళ్, బీఎస్పీ, టీడీపీ మద్ధతు పలికాయి.