లాలూపై కేసు పెట్టిన వారిలో నేను లేను

లాలూపై కేసు పెట్టిన వారిలో నేను లేను

దాణా స్కాంకు సంబంధించిన ఐదో కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ కు ఐదేళ్లు శిక్ష పడటంపై బీహార్ సీఎం నితీశ్ కుమార్ స్పందించారు. ఆర్జేడీ చీఫ్పై కేసు నమోదుచేయడం వెనుక తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. అప్పట్లో సమతా పార్టీ చీఫ్ జార్జ్ ఫెర్నాండెజ్ పిటిషన్పై సంతకం చేయమని కోరినా తాను నిరాకరించినట్లు చెప్పారు. కేసులు పెట్టాలనుకుంటే ఆ పని మీరే చేసుకోండని సూచించానని నితీశ్ అన్నారు. దీంతో ఫెర్నాండెజ్ ఢిల్లీలో ఉన్న శివానంద్ తివారీని పాట్నాకు పిలిపించి కంప్లైంట్పై సంతకం చేయించారని అన్నారు. ప్రస్తుతం ఆ శివానంద్ తివారీ లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీలోనే ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. 

దాణా కుంభకోణానికి సంబంధించిన ఐదో కేసులో రాంబీ సీబీఐ కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. లాలూ ప్రసాద్ కు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.60లక్షల ఫైన్ విధించింది.