పోలింగ్ శాతం, రిజల్ట్పై తొందరపాటు వద్దు.. డిసెంబర్ 9 సాయంత్రం 5 గంటల నుంచి ప్రచారం బంద్

 పోలింగ్ శాతం,  రిజల్ట్పై తొందరపాటు వద్దు.. డిసెంబర్ 9  సాయంత్రం 5 గంటల నుంచి ప్రచారం బంద్
  • ఓటు వేయడానికి వేతనంతో కూడిన సెలవు 
  • కలెక్టర్ వినయ్​కృష్ణారెడ్డి​ 

నిజామాబాద్, వెలుగు : గ్రామ పంచాయతీ పోలింగ్ శాతం, రిజల్ట్​విషయంలో క్రాస్​ చెక్ చేసుకొని ప్రకటించాలని,  తొందరపాటుగా వ్యవహరిస్తే సమస్యలు వస్తాయని కలెక్టర్ వినయ్​కృష్ణారెడ్డి యంత్రాంగానికి సూచించారు.  సోమవారం ఎంపీడీవో, ఎంపీవో, రిటర్నింగ్​ ఆఫీసర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్​లో కలెక్టర్​మాట్లాడారు. ఫస్ట్​ ఫేజ్​లో11న జరిగే పోలింగ్ కోసం అన్ని గ్రామాల్లో ఫొటోలతో కూడిన ఓటర్​ స్లిప్​లను పంపిణీ చేయాలని, బ్యాలెట్ పేపర్ పట్ల అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 

ఉదయం డిస్ట్రిబ్యూషన్ పాయింట్​కు చేరుకొని పోలింగ్ మెటీరియల్​తో సెంటర్లకు చేరుకోవాలన్నారు. పోలింగ్ సెంటర్​లో తాగునీరు, టాయిలెట్స్, కరెంట్ సప్లయ్, ఫ్యాన్ విధిగా ఉండాలన్నారు. పోలింగ్ ముగిశాక కౌంటింగ్ ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. అడిషనల్​కలెక్టర్లు అంకిత్, కిరణ్​కుమార్, సబ్​ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాలవ్య, ఆర్డీవో రాజేంద్రకుమార్, డీఆర్డీవో సాయాగౌడ్, డీపీవో శ్రీనివాస్​రావు తదితరులు పాల్గొన్నారు.

ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్​ 

మూడు విడతల్లో జరిగే ఎన్నికల్లో ఓటు వేయడానికి ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు ఉంటుందని కలెక్టర్ వెల్లడించారు. సర్కార్ ఎంప్లాయీస్ కోసం ఎంపీడీవో ఆఫీసుల్లో పోస్టల్ బ్యాలెట్​ ఫెసిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఫస్ట్​ ఫేజ్ పోలింగ్ సెంటర్ల కోసం ఉపయోగించే స్కూల్స్​కు 10, 11వ తేదీలుసెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశామన్నారు. 
మంగళవారం సాయంత్రం 5 గంటలకు ఎన్నికల అభ్యర్థులు ప్రచారం క్లోజ్ చేయాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లిక్కర్ షాప్​లు క్లోజ్ చేయాలని పేర్కొన్నారు.