
హైదరాబాద్ : తమకు గుర్తులు కేటాయించినట్లు ఎన్నికల అధికారులు సమాచారం ఇవ్వలేదన్నారు నిజామాబాద్ పార్లమెంట్ రైతులు (స్వతంత్ర అభ్యర్థులు ). ఈ క్రమంలోనే నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికను 15 రోజులపాటు వాయిదా వేయాలని ECని కోరామన్నారు. మంగళవారం సెక్రటరియేట్ లో ఈసీని కలిసిన అభ్యర్థులు…నియోజకవర్గంలోని ఎన్నికల సమస్యలపై చర్చించారు.
తమకు గుర్తులు కేటాయించినట్లుగా అధికారులు సమాచారమే ఇవ్వలేదన్నారు. చాలా తక్కువ టైం ఉన్నందువల్ల ఎప్పుడు ప్రచారం చేసుకోవాలని ప్రశ్నించారు. ఈవీఎంలపై తమకు నమ్మకం లేదన్న అభ్యర్థులు… పేపర్ బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. సమస్యలపై కోర్టుకు వెళ్లేందుకు సిద్దమౌతున్నట్లు తెలిపారు.