ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

కామారెడ్డి, వెలుగు: డబుల్ బెడ్ రూం ఇండ్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట బహుజన లెఫ్ట్ ‌‌ఫ్రంట్ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. జిల్లాలో పలు చోట్ల ఇండ్ల నిర్మాణం జరిగి ఏండ్లు గడుస్తున్నా లబ్ధిదారులకు పంపిణీ చేయడం లేదని బీఎల్ఎఫ్ స్టేట్ కన్వీనర్ దండి వెంకటి, స్టేట్​ లీడర్​ ఎస్. సిద్ధిరాములు పేర్కొన్నారు. అనంతరం కలెక్టర్​కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ కమ్మరి సదానందం, అంజనేయులు, జబ్బర్ ‌‌ నాయక్ ‌‌, సాయికృష్ణ, గంగామణి  పాల్గొన్నారు.

అక్రమ కేసులు ఎత్తివేయాలి

నిజామాబాద్ క్రైమ్, వెలుగు: హిందూ ఆలయాల పరిరక్షకుడు, పటేల్ ప్రసాద్ ‌‌పై పోలీసులు పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం బీజేపీ నాయకులు సీపీ ఆఫీస్ ‌‌ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నేతలు వినయ్ ‌‌రెడ్డి, రాజేశ్వర్ మాట్లాడుతూ సీపీ నాగరాజు కావాలనే పటేల్ ప్రసాద్ ‌‌పై అక్రమ కేసు పెట్టి, పీడీ యాక్ట్ నమోదు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు సేవ చేయాల్సిన సీపీ అధికార పార్టీ లీడర్లకు కొమ్ము కాస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.  ఓబీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి స్వామియాదవ్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కేపీ రెడ్డి, సుధాకర్, వేణు, నారాయణ యాదవ్ పాల్గొన్నారు.

కామారెడ్డిలో 336 కొనుగోలు సెంటర్లు

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లాలో వడ్ల కొనుగోలుకు 336 సెంటర్లను ఏర్పాటు చేస్తామని కలెక్టర్​ జితేష్ వి పాటిల్​చెప్పారు. సోమవారం కలెక్టరేట్ ‌‌లో వడ్ల కొనుగోలుపై ఆఫీసర్లతో రివ్యూ నిర్వించారు. 6.10 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించి గన్నీ బ్యాగులు, తేమ శాతం పరిశీలించే యంత్రాలు రెడీగా ఉన్నాయన్నారు. కలెక్టరేట్ ‌‌లో కంట్రోల్​ రూం ఏర్పాటు చేస్తామన్నారు. ఎస్పీ బి. శ్రీనివాస్​రెడ్డి, అడిషనల్​ కలెక్టర్ చంద్రమోహన్,   ఆఫీసర్లు పాల్గొన్నారు.  అనంతరం నేషనల్ లెవల్ ‌‌లో పంచాయతీలకు  అవార్డు కోసం పంపే ఎంట్రీలపై సంబంధిత ఆఫీసర్లతో మీటింగ్​నిర్వహించారు. కలెక్టర్​తో పాటు అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్​దొత్రే, జడ్పీ సీఈవో సాయాగౌడ్, డీపీవో శ్రీనివాస్ ‌‌రావు పాల్గొన్నారు.

విమర్శలు చేస్తే ఊరుకోం..

సిరికొండ, వెలుగు: సిరికొండ మండలంలోని పాకాలతో పాటు అన్ని గ్రామలను డెవలప్ చేస్తున్న ఆర్టీసీ చైర్మన్, రూరల్​ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ‌‌పై విమర్శలు చేస్తే ఊరుకోమని జట్పీటీసీ మాలవత్​ మాన్​సింగ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ అన్నారు. సోమవారం వారు మీడియాతో మాట్లాడుతూ పాకాలలో కొందరు యువకులతో కలిసి వార్డు మెంబర్ గంగాధర్​ఉద్దేశ పూర్వకంగా ఎమ్మెల్యేపై ఆరోపనులు చేశారని మండిపడ్డారు. పాకాల గ్రామానికి రైతు బంధు జిల్లా అధ్యక్ష పీఠాన్ని ఇవ్వడంతో పాటు గ్రామానికి రూ.కోటితో బీటీ రోడ్డు, గోప్యా తండాకు రూ.42లక్షతో బ్రిడ్జి, రూ.15 లక్షలతో సీసీ రోడ్లు మంజూరు చేసింది ఎమ్మెల్యే కాదా అని ప్రశ్నించారు. అభివృద్ధి చేస్తున్న ఆర్టీసీ చైర్మన్ ‌‌పై బురదజల్లే ప్రయత్నం మానుకోకపోతే తగిన బుద్ధి చెబుతామని హెచ్చారించారు.

కామారెడ్డి డిగ్రీ కాలేజీ వ్యవస్థాపకుడి మృతి

కామారెడ్డి , వెలుగు: కామారెడ్డి డిగ్రీ కాలేజీ వ్యవస్థాపకుల్లో ఒకరైన రిటైర్డు ఐఏఎస్ ఆఫీసర్​  బి.ఎన్ రామన్ ఆదివారం హైదరాబాద్ ‌‌లో చనిపోయారు. ఆయన మృతికి సోమవారం డిగ్రీ కాలేజీలో సంతాపం ప్రకటించారు. ఇన్ ‌‌చార్జి ప్రిన్సిపాల్ చంద్రకాంత్, లెక్చరర్లు ఆయన ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. 1963-64లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ‌‌ ‌‌గా బి.ఎన్ రామన్ పని చేసినప్పుడు  కామారెడ్డిలో విద్యా సంస్థ ఏర్పాటు చేసేందుకు అప్పటి స్థానిక ప్రజాప్రతినిధులు, వ్యాపారులు, రైతుల సహకారంతో 268 ఎకరాల భూమి సేకరించారు. రామన్ మృతి తీరని లోటని పలువురు పేర్కొన్నారు.  

కేసీఆర్‌‌పై విమర్శలు సరికాదు

బోధన్, వెలుగు: పాదయాత్ర పేరుతో ఊళ్లు తిరుగుతున్న షర్మిల సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే షకీల్ ‌‌పై విమర్శలు చేయడం సరికాదని టీఆర్ఎస్ నాయకులు అన్నారు. సోమవారం బోధన్ ఎమ్మెల్యే క్యాంప్​ఆఫీసులో నిర్వహించిన ప్రెస్ ‌‌ మీట్ ‌‌లో టీఆర్ఎస్ నాయకులు, డీసీసీబీ డైరెక్టర్ గిర్దావార్ ‌‌ ‌‌ గంగారెడ్డి, మార్కెట్​కమిటీ చైర్మన్ ‌‌ వి.ఆర్ దేశాయ్ తదితరులు షర్మిల వ్యాఖ్యలను ఖండించారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఉన్నాయని ప్రశ్నించారు. వైఎస్ ‌‌ రాజశేఖర్ ‌‌ ‌‌రెడ్డి తెలంగాణను అడ్డుకుంటే కేసీఆర్ కోట్లడి తీసుకవచ్చారని గుర్తుచేశారు. సమావేశంలో టీఆర్ఎస్​మండల ప్రెసిడెంట్ నర్సన్న,  రైతు బంధు మాజీ మండల ప్రెసిడెంట్ బుద్దె రాజేశ్వర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ‌‌ సాలూర షకీల్, మండల ప్రధాన కార్యదర్శి సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.

వీడీసీ పేరుతో వేధిస్తున్నరు

నిజామాబాద్, వెలుగు: ఒక వర్గం వారు వీడీసీ పేరుతో వేధిస్తున్న వారిపై చర్యలు చేపట్టాలని మారంపల్లి గ్రామస్తులు నిజామాబాద్ ‌‌ కలెక్టర్ ‌‌ ‌‌ను కోరారు. ఈ మేరకు సోమవారం  గ్రామానికి చెందిన వివిధ కులాలకు చెందిన 50 మంది కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టారు. అనంతరం అడిషనల్ ‌‌ కలెక్టర్ చంద్రశేఖర్ ‌‌ ‌‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ అరుగుల రవి, మెడిదొడ్డి రాజు, రంజిత్, గొండ చిన్నరాజేశ్వర్, కాశిపారం చిన్నరెడ్డి, మోత్కూరి చిన్ననర్సాగౌడ్, రాజేశ్వర్,  జనార్దన్ పాల్గొన్నారు.