ప్రభాస్ కల్కిలో ఆ ఎలిమెంట్స్ ఉండవట.. కథే కారణం?

ప్రభాస్ కల్కిలో ఆ ఎలిమెంట్స్ ఉండవట.. కథే కారణం?

గ్లోబల్ స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ కల్కి 2898AD(Kalki 2898 AD). ఈ సినిమాలో ఆ ఎలిమెంట్స్ ఉండవట. దానికి కారణం కథే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ ఎలిమెంట్స్ ఏంటి? ఎందుకు ఈ సినిమా కోసం ఆ ఎలిమెంట్స్ ను తీసేస్తున్నారు అంటే. 

కథ ప్రకారం ప్రభాస్ కల్కి అవతారంలో కనిపిస్తారని సమాచారం. హిందూ పురాణాలకు, ఇతిహాసాలకు సంబందించిన కథ కాబట్టి ఈ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ కు అంతగా స్కోప్ ఇవ్వడం లేదట మేకర్స్. మరీ ముఖ్యంగా కల్కి సినిమాలో పాటలు ఉండవని సమాచారం. హీరోహీరోయిన్ పాత్రలమేరకు మాత్రమే ఉంటారు తప్పితే.. వాళ్ల మధ్య పాటలు, ప్రేమ సన్నివేశాలు ఉండవని తెలుస్తోంది. ఒకవేళ పాటలు ఉన్నప్పటికీ అవి కూడా కథానుసారం వచ్చే సిచువేషనల్ సాంగ్స్ తప్పా.. హీరోహీరోయిన్ మధ్య వచ్చే సాంగ్స్ గా ఉండవట.

పురాణాలకు, విష్ణుమూర్తి అవతారానికి సంబందించిన కాన్సెప్ట్ కాబట్టి.. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా కథకు మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తూ తెరకెక్కిస్తున్నారట మేకర్స్. ఇప్పటికే ప్రభాస్ నటించిన ఆదిపురుష్ విషయంలో జరిగిన తప్పులు ఈ సినిమాలో జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం. అయితే సినిమాలో ప్రభాస్ ఎలివేషన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రం గూస్బంప్స్ తెప్పిచేలా డిజైన్ చేస్తున్నారట. ఇందుకోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారని సమాచారం. కాబట్టి ప్రభాస్ ఫ్యాన్స్ ఏమాత్రం డిజప్పాయింట్ కాకుండా చేసుకుంటున్నారట.

ఇక కల్కి 2898 AD సినిమా విషయానికి వస్తే.. దర్శకుడు నాగ్ అశ్విన్(Nag ashwin) తెరకెక్కిస్తున్న ఈ పాన్ వరల్డ్ మూవీలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన్(Deepika padukone) హీరోయిన్ గా నటిస్తోంది. ఇంకా బిగ్ బీ అమితాబ్ బచ్చన్(Amitab bachhan), లోకనాయకుడు కమల్ హాసన్(Kamal haasan) లాంటి లెజెండరీ నటులతో వస్తున్న ఈ ప్రెస్టీజియస్ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల  ముందుకు రానుంది.