
లింగంపేట, వెలుగు: నాగిరెడ్డిపేట మండల ఇంచార్జి ఎంపీపీగా కొనసాగిన వైస్ ఎంపీపీ దివిటిరాజ్దాస్పై అవిశ్వాసం నెగ్గినట్లు ఆర్డీఓ ప్రభాకర్ ప్రకటించారు. బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఆరుగురు ఎంపీటీసీ మెంబర్లు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో ఎల్లారెడ్డి ఆర్డీఓ ప్రభాకర్ అవిశ్వాస పరీక్ష నిర్వహించారు. మండలంలో 9 మంది ఎంపీటీసీ మెంబర్లు ఉండగా ఆరుగురు బీఆర్‌ఎస్ ఎంపీటీసీ సభ్యులు వైస్ ఎంపీపీకి వ్యతిరేకంగా చేతులెత్తడంతో అవిశ్వాసం నెగ్గినట్లు ఆర్డీఓ ప్రకటించారు. వైస్ ఎంపీపీ దివిటి రాజ్దాస్ నాలుగేళ్లుగా నాగిరెడ్డిపేట మండల ఇంచార్జి ఎంపీపీగా కొనసాగారు. అవిశ్వాసం నెగ్గడంతో మండల బీఆర్‌ఎస్ లీడర్లు పటాకులు కాల్చి సంబురాలు జరుపుకున్నారు.