పెట్రోల్, డీజిల్ అమ్ముడు పోవట్లేదు

పెట్రోల్, డీజిల్ అమ్ముడు పోవట్లేదు

భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ డిమాండ్

న్యూఢిల్లీ: దేశంలో ఫ్యూయల్ డిమాండ్ భారీగా పడిపోయింది. డీజిల్ అమ్మకాలు నాలుగో వంతు తగ్గిపోగా.. పెట్రోల్ అమ్మకం 15 శాతం తగ్గి పోయింది. ఇక జెట్ ఫ్యూయల్ కూడా అదే విధంగా కుప్పకూలింది. దీనికంతటికీ కారణం కరోనా. ఈ వైరస్ ప్రభావంతో దేశమంతా లాక్‌డౌన్ కొనసాగుతుండటంతో, వ్యాపారాలు, రవాణా అంతా స్తంభించింది. విమానాల రాకపోకలు లేవు. చాలా మంది ప్రజలు ఇళ్లనుంచి బయటికి రావడం లేదు. ప్రయాణాలనేదే లేదు. దీంతో ఫ్యూయల్ డిమాండ్ మార్చిలో భారీగా క్రాష్‌ అయిందని ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్‌లు చెప్పారు. ఏప్రిల్ తొలి పదిహేను రోజుల్లో దీని డిమాండ్ మరింత దారుణంగా పడిపోనుందని హెచ్చరించారు. మార్చిలో డీజిల్ డిమాండ్ గతేడాదితో పోలిస్తే 24 శాతం పడిపోయింది. మొత్తం ఆయిల్ డిమాండ్‌లో ఒక్క డీజిల్‌ డిమాండే 40 శాతం వరకు ఉంటుంది. ఎకనమిక్ యాక్టివిటీని కొలవడంలో డీజిల్‌ను
కూడా ఒక పారామీటర్‌‌గా తీసుకుంటారు. పెట్రోల్ సేల్స్ మార్చిలో 15.5 శాతం తగ్గి పోయాయి. అన్ని డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ఫ్లయిట్స్ రాకపోకలు నిలిచిపోవడంతో, జెట్ ఫ్యూయల్ డిమాండ్ ఏకంగా 31 శాతం మేర పడిపోయింది.

కుకింగ్ గ్యాస్‌కు మాత్రమే డిమాండ్…
కుకింగ్ గ్యాస్‌(ఎల్‌పీజీ)కు మాత్రమే 3 శాతం డిమాండ్ పెరిగింది. మార్చిలో డిమాండ్ పెరిగిన ఏకైక ఫ్యూయల్ ఇదే. లాక్‌డౌన్‌తో కన్జూమర్లు ఎక్కువగా కుకింగ్ గ్యాస్‌ను రీఫిల్ చేసుకుంటున్నారు. అయితే 2019 ఏప్రిల్ నుంచి 2020 ఫిబ్రవరి వరకున్న కాలంలో మాత్రం పెట్రోల్ సేల్స్ 8.2 శాతం పెరగగా.. డీజిల్ సేల్స్ ఫ్లాట్‌గా నమోదయ్యాయి. మొత్తం ఆయిల్ డిమాండ్ ఈ కాలంలో 2 శాతమే పెరిగింది.

For More News..

భారీగా తగ్గిన మొబైల్ రీఛార్జులు

ఇండిపెండెన్స్‌ తర్వాత ఇదే మొదటి సారి..

మహేష్ బాబు కుటుంబం నుంచి మరో హీరో

ఒక్కో బస్సులో 100 మంది.. మరి వీరికి రాదా కరోనా?