
న్యూఢిల్లీ: యూకే నుంచి దిగుమతి చేసుకునే వైన్‌పై సుంకాలను ఇండియా తగ్గించడం లేదని, మే 6న ప్రకటించిన భారత్–-యూకే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (ఎఫ్‌టీఏ) కింద బ్రిటిష్ బీర్‌పై కూడా పరిమితంగానే సుంకాలను తగ్గించనుందని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. "ఇతర వ్యవసాయ ఉత్పత్తులతో పాటే వైన్ కూడా ఎక్స్‌క్లూజన్ లిస్ట్‌లో ఉంది. బ్రిటిష్ బీర్‌పై కూడా ఇండియా టారిఫ్‌లను చాలా తక్కువగా తగ్గించనుంది" అని పేర్కొన్నారు. డెయిరీ ఉత్పత్తులు, యాపిల్, చీజ్, ఓట్స్, యానిమల్, వెజిటబుల్ ఆయిల్స్ వంటి ఇతర సెన్సిటివ్ అగ్రి ప్రొడక్ట్‌లపై కూడా దిగుమతి డ్యూటీలో ఎలాంటి తగ్గింపు ఇవ్వడం లేదు.
కాగా, భారత్, యూకే మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ముగిసినట్లు ఈ నెల 6న అధికారిక ప్రకటన వచ్చింది. ఈ ఒప్పందం వల్ల భారత్‌లో బ్రిటిష్ స్కాచ్ విస్కీ, కార్లు చౌక అవుతాయి. అదే సమయంలో యూకేకు ఎగుమతి అయ్యే గార్మెంట్స్, లెదర్ ఉత్పత్తులపై డ్యూటీలు తగ్గుతాయి. ఒప్పందం ప్రకారం, యూకే విస్కీ, జిన్‌పై డ్యూటీని భారత్ 150 శాతం నుంచి 75 శాతానికి, పదేండ్లలో దీనిని 40 శాతానికి తగ్గిస్తుంది.
యూకే వైన్‌పై సుంకాలను తగ్గించడం లేదు. వైన్ తయారీలో యూరోపియన్ యూనియన్ (ఈయూ) ముందుంది. యూకేకి డ్యూటీ తగ్గిస్తే, ఈయూ కూడా తమ వైన్‌పై అదే రకమైన డ్యూటీ తగ్గింపులు ఇవ్వాలని భారత్‌పై ఒత్తిడి చేసే అవకాశం ఉంది. భారత్, ఈయూ మధ్య ఎఫ్‌టీఏ చర్చలు ప్రస్తుతం చివరి దశలో ఉన్న విషయం తెలిసిందే.