మీకు తెలుసా : ఇంటర్నెట్ లేకుండా గూగుల్ మ్యాప్ ఎలా పని చేస్తుంది..!

మీకు తెలుసా : ఇంటర్నెట్ లేకుండా గూగుల్ మ్యాప్ ఎలా పని చేస్తుంది..!

యూజర్స్ కు బెస్ట్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చేందుకు గూగుల్ ఇప్పటికే ఎన్నో లేటెస్ట్ ఫీచర్స్ తో ఆశ్చర్యపరుస్తూనే ఉంది. ఇప్పుడు గూగుల్ మ్యాప్ లోనూ కొన్ని కీలక మార్పులు తీసుకువస్తోంది. ఈ ఫీచర్ తో మీకు నచ్చిన లేదా ఇష్టమైన లొకేషన్స్ ను సేవ్ చేయొచ్చు. మళ్లీ వెళ్లడానికి లేదా ఎక్కువగా సందర్శించే ప్రదేశాలను ఈజీగా గుర్తించేందుకు, లేబుల్ చేసేందుకు ఇది అనుకూలంగా ఉంటుంది.

డెస్క్ టాప్ పై ఎలా సేవ్ చేయాలంటే..

లొకేషన్స్ ను కనుక్కోవడం : కావాల్సిన లేదా చేరుకోవాల్సని లొకేషన్స్ ను సెర్చ్ చేయాలి

సేవ్ పై క్లిక్ చేయండి : స్థలం పేరు క్రింద సేవ్ బటన్ (ఇది బుక్‌మార్క్ లాగా కనిపిస్తుంది) నొక్కాలి.

లిస్ట్ ను ఎంచుకోండి : ఇష్టమైనవి లేదా వెళ్లాలనుకునేటు వంటి స్థలాల జాబితాను ఎంచుకోవాలి.

మొబైల్ లో ఎలా చేయాలంటే..

  • గూగుల్ మ్యాప్ లో సెర్చ్ స్పేస్ బార్ పై వెళ్లాలనుకున్న స్థలాలను సెర్చ్ చేసి.. లాంగ్ ప్రెస్ చేసి పిన్ చేయాలి.
  • కింద బుక్ మార్క్ లా కనిపించే సేవ్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • ఇంతకుముందు లేదా కొత్త స్థలాలను లిస్టవుట్ చేయాలి.
  • ఫైనల్ గా Done అనే బటన్ పై క్లిక్ చేసి, సేవ్ చేయాలి.

మరిన్ని చిట్కాలు

  • సేవ్ చేసిన స్థలాలను సులభంగా గుర్తించడానికి లేబుల్ క్రియేట్ చేయొచ్చు.
  • నిర్దిష్ట ప్రాంతాల కోసం మ్యాప్‌లను ముందుగానే డౌన్‌లోడ్ చేసుకోండి. దీని వల్ల ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా కూడా మీరు మీ సేవ్ చేసిన స్థలాలను వీక్షించవచ్చు.
  • మీరు సేవ్ చేసిన స్థలాలను లింక్ ద్వారా ఇతరులతో పంచుకోవచ్చు.