నవంబర్ 30 వరకు సెలవుల్లేవ్

నవంబర్ 30 వరకు సెలవుల్లేవ్

పండుగల వేళ ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న మరో నిర్ణయం హాట్ టాపిక్ అయింది. అక్టోబర్, నవంబర్ నెలల్లో వరుస పండుగలు ఉండటంతో… నవంబర్ 30వ తేదీ వరకు ఫీల్డ్ లో పనిచేసే ఉద్యోగులకు సెలవులు రద్దుచేసింది అక్కడి ప్రభుత్వం. గ్రౌండ్ లెవెల్ల ో పనిచేసే అన్ని విభాగాల ఫీల్డ్ ఆఫీసర్స్ నవంబర్ 30 వరకు సెలవులు తీసుకోవద్దని సూచిస్తూ.. అక్కడి ప్రభుత్వం సర్క్యులర్ జారీచేసింది.

“నవంబర్ 30 వరకు ప్రజలకు అందుబాటులో ఉండండి. ఆఫీసులను వదిలి వెళ్లకండి. ఈ ఆదేశాలను అందరూ పాటించేలా చూడండి” అని యూపీ ప్రభుత్వం ఫీల్డ్ ఆఫీసర్స్ కు సూచించింది.