ఆదిభట్ల మున్సిపల్ చైర్పర్సన్పై అవిశ్వాస తీర్మానం

ఆదిభట్ల మున్సిపల్ చైర్పర్సన్పై అవిశ్వాస తీర్మానం

మున్సిపల్ ఛైర్మన్లపై కౌన్సిలర్ల తిరుగుబాటు కొనసాగుతోంది. తాాజాగా రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల మున్సిపల్ ఛైైర్ పర్సన్ కొత్త ఆర్థికకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెట్టారు. 15 మంది కౌన్సిలర్లలో 13 మంది అవిశ్వాసంపై సంతకం చేసి కలెక్టర్ కు అందజేశారు. ఆదిభట్ల మున్సిపల్ చైర్పర్సన్ కొత్త ఆర్థిక కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్ఎస్ లోకి వెళ్లారు. చైర్ పర్సన్ పీఠం అధిష్టించిన తర్వాత పార్టీలోని పరిస్థితులు నచ్చక తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు.