కొవాగ్జిన్‌పై మరింత సమాచారం కావాలి

 కొవాగ్జిన్‌పై మరింత సమాచారం కావాలి
  •  కొవాగ్జిన్‌పై మరింత సమాచారం కావాలి
  • కొవాగ్జిన్‌‌ అత్యవస వినియోగంపై WHO సూచనలు

కొవాగ్జిన్ టీకాను అత్యవసర వినియోగ జాబితాలో చేర్చడం మరింత ఆలస్యం కానుంది. కొవాగ్జిన్ కు సంబంధించి మరింత సమాచారం కావాలని భారత్ బయోటెక్ ను కోరింది WHO అడ్వైజరి కమిటీ. ఈ వారాంతానికి ఆ సమాచారం ఇవ్వాలని భారత్ బయోటెక్ కు సూచించింది. దీనిపై సమీక్షించేందుకు నవంబర్ 3న మరోసారి సమావేశం కానుంది WHO టెక్నికల్ అడ్వైజరి కమిటీ.

హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ కంపెనీ కొవాగ్జిన్ టీకాను డెవలప్ చేసింది. ఏప్రిల్ 19న ఎమర్జెన్సి అప్రూవల్ కోసం WHOకు దరఖాస్తు చేసుకుంది.జూన్ లో ముగిసిన ఫేజ్ త్రి ట్రయల్స్ ముగిసిన తర్వాత సింప్టొమాటిక్ కరోనాపై కొవాగ్జిన్ టీకా 77.8 శాతం ప్రభావం చూపినట్లు తెలిపింది భారత్ బయోటెక్ . డెల్టా వేరియంట్ పై 65.2 శాతం ఎఫెక్ట్ చూపినట్లు తెలిపింది. ఇక ఇప్పటివరకూ కరోనాకు సంబంధించి ఫైజర్, ఆస్ట్రాజెనికా, జాన్సన్ అండ్ జాన్సన్, మోడెర్నా, సినోఫార్మ్ వ్యాక్సిన్లకు WHO ఆమోదం తెలిపింది.