మమ్మల్ని ఎవరూ గుర్తుపట్టలేదు: అనుష్క విరాట్

మమ్మల్ని ఎవరూ గుర్తుపట్టలేదు: అనుష్క విరాట్

పరుగుల వీరుడు విరాట్ కోహ్లీ తన 31వ పుట్టినరోజును భార్య, బాలీవుడ్ భామ అనుష్క శర్మతో కలిసి భూటాన్ లో జరుపుకుంటున్నాడు. బంగ్లాదేశ్ టీ20 సీరిస్ నుంచి విశ్రాంతి తీసుకున్న కోహ్లీ, సినిమా షూటింగ్ లకు విరామం ఇచ్చిన అనుష్క శర్మ భూటాన్ లో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు. విరుష్క జంట భూటాన్ లో 8.5 కి.మీ. ఎత్తున ఉన్న ఓ కొండ ప్రాంతానికి ట్రెక్కింగ్ వెళ్లారు. మధ్యలో కాస్త విరామం తీసుకుందామని ఓ చిన్న కుగ్రామం వద్ద ఆగారు. అయితే అక్కడున్న ఓ కుటుంబం విరుష్క జంటను అలసిపోయారని భావించి టీ తాగడానికి తమ ఇంటికి ఆహ్వానించారు. అయితే ఆ ఇంటి సభ్యులు కోహ్లీని కానీ, అనుష్కను కానీ గుర్తుపట్టకపోవడం ఆశ్చర్యం. తమను ఎవరూ గుర్తపట్టకపోవడమే కాకుండా.. తమను సెలబ్రెటిల్లాగా కాకుండా, సాదారణ మనుషుల్లాగే ట్రీట్ చేస్తుంటే ఆ ఆనందం చెప్పలేనిదని అనుష్క తన అనుభవాన్ని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ… వారితో దిగిన ఓ ఫోటోను కూడా జతచేసింది. అదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారి నెటిజన్లు తెగ లైకులు వేస్తున్నారు.