
ఫ్రాడ్స్, హ్యాకర్ల నుంచి తప్పించి మొబైల్ సెక్యూరిటీని పెంచడానికి కొన్ని యాప్స్ ఎప్పటికప్పుడు కొత్త అప్‌డేట్స్, ఫీచర్స్ తీసుకొస్తూనే ఉంటాయి. దానివల్ల యూజర్ల పర్సనల్ డేటాను కాపాడటమే కాకుండా, యూజర్ల పర్సనల్ ఎక్స్‌పీరియెన్స్ కూడా బాగుంటుంది. అలాంటి కొన్ని కొత్త అప్‌డేట్లని తీసుకొస్తున్నాయి కంపెనీలు.
జిరాక్స్ కాపీ కూడా డోర్ డెలివరీనే!
గ్రాసరీ డెలివరీ యాప్ అయిన బ్లింక్‌ఇట్ కంపెనీని ఈ మధ్యే ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో 4,447 కోట్ల రూపాయలకు కొనుక్కుంది. దాంట్లో గ్రాసరీ డెలివరీతో పాటు ఇప్పుడు కొత్త సర్వీస్‌ను తీసుకురానుంది. అదే 11 నిమిషాల్లో ప్రింట్‌అవుట్స్ డెలివరీ. డాక్యుమెంట్, సర్టిఫికెట్ అర్జెంట్‌గా జిరాక్స్ కావాల్సి వచ్చినపుడు జిరాక్స్ సెంటర్ ఎక్కడుందో అని వెతుకుతుంటారు. అలా వెతికే పనిలేకుండా ఈ సర్వీస్ హెల్ప్ అవుతుంది. యాప్‌లో జిరాక్స్ కావాల్సిన సర్టిఫికెట్‌ని అప్‌లోడ్ చేయాలి. అప్‌లోడ్ చేసిన పదినిమిషాల్లో యాప్‌నుంచి సర్టిఫికెట్ డిలీట్ అవుతుంది. పదకొండో నిమిషం జిరాక్స్ ప్రింట్ తీసుకొని డెలివరీ బాయ్ మీ దగ్గరకు వస్తాడు.
వీడియోల్లో వాటర్ మార్క్
టిక్‌టాక్ బ్యాన్ అయ్యాక ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌కి, యూట్యూబ్ షార్ట్స్‌కి క్రేజ్ పెరిగింది. వాటిలో కంటెంట్ క్రియేట్ చేసేవాళ్లు చాలామందే ఉన్నారు. అయితే వాళ్ల వీడియోలని డౌన్‌లోడ్ చేసుకొని వేరే పేర్లమీద మళ్లీ అప్‌లోడ్ చేస్తున్నారు కొందరు. అయితే ఇకనుంచి ఎవరైనా వాటిని డౌన్‌లోడ్ చేస్తే ఆ వీడియోలపై కంపెనీ వాటర్‌మార్క్ ఉండేలా ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లలో అప్‌డేట్ వచ్చింది.
ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్‌తో ఫోన్ అప్‌డేట్స్ ఇచ్చే ఆండ్రాయిడ్, ఇప్పుడు కొత్త వెర్షన్‌ని లాంచ్ చేసింది. ఆండ్రాయిడ్ 13 పేరుతో వస్తున్న ఈ లేటెస్ట్ వెర్షన్ ప్రస్తుతానికి అన్ని కంపెనీ ఫ్లాగ్‌షిప్ ఆండ్రాయిడ్ ఫోన్స్‌కి అందుబాటులోకి తీసుకొచ్చింది. తరువాత దశలవారీగా మిగతా ఫోన్లకి తీసుకొస్తామని చెప్పింది ఆండ్రాయిడ్. ఈ వెర్షన్‌లో కొత్తగా...
- ఫోన్‌లో ఉన్న యాప్స్ అన్నింటిని హోమ్ పేజ్ మీద నచ్చిన సైజ్ పెట్టుకునే ఫీచర్ తీసుకొచ్చింది. దీనివల్ల ఎక్కువగా వాడే యాప్ ఎక్కడుందో వెతుక్కోనవసరం ఉండదు.
- స్పాట్ లైట్ ఆర్ట్‌వర్క్ ఫీచర్ యాడ్ చేసింది. దీనివల్ల ఫోన్ లేదా ఇతర యాప్స్‌లో పాటలు వింటున్నప్పుడు స్క్రీన్‌మీద పాట బీట్‌కు తగ్గట్టు లైట్ వేవ్స్ వస్తాయి. ఈ ఎక్స్‌పీరియెన్స్ కావాలంటే ఉంచొచ్చు, లేదంటే డిజేబుల్ చేసుకోవచ్చు.
-
- కస్టమైజ్ బెడ్ టైం ఆప్షన్ కూడా ఉంది. నిద్రపోయే టైంని ఫిక్స్ చేస్తే, ఆ టైంకి వాల్‌పేపర్ కలర్స్ మారిపోయి, డార్క్ థీమ్ ఎనేబుల్ అవుతుంది.
- కీ బోర్డ్‌లో టైప్ చేసే ప్రతీ అక్షరం సేవ్ అవుతుంది. అలా సేవ్ అయిన అక్షరాలే, టైప్ చేస్తున్నప్పుడు కీ బోర్డ్‌పైన వస్తుంటాయి. ఈ వెర్షన్‌లో కీ బోర్డ్ హిస్టరీని కూడా డిలీట్ చేసుకోవచ్చు.
- ఈ అప్‌డేట్‌లో బ్లూటూత్ సిస్టమ్ పని తీరు మెరుగుపరిచింది. అంటే ఇప్పడు వేరే డివైజ్‌తో బ్లూటూత్‌ని తొందరగా కనెక్ట్ చేయొచ్చు.
స్క్రీన్‌షాట్స్ బ్లాక్
వాట్సాప్ చాట్, వీడియో కాల్స్‌లో ఎక్కువగా పర్సనల్ చాట్ చేస్తుంటారు చాలామంది. అలా చేస్తున్నప్పుడు కొంతమంది వాటిని స్క్రీన్‌షాట్ తీసి మిస్‌యూజ్ చేసే అవకాశం ఉంది. వాటిని తగ్గించేందుకు వాట్సాప్ కొత్త అప్‌డేట్ తేనుంది. ఇకనుంచి చాట్, ఫొటో, వీడియో కాల్‌ని ఎవరూ స్క్రీన్‌షాట్ తీసుకునే వీలులేకుండా పర్మిషన్స్‌ని బ్లాక్ చేస్తుంది. దాంతో పర్సనల్ చాట్‌లోని విషయాలు, వీడియో కాల్ వివరాలు, ఫ్రీజ్ చేసినవి వేరేవాళ్లకు షేర్ చేసే అవకాశం తగ్గుతుంది.