పొల్యుషన్‌ సర్టిఫికేట్‌ చూపెడితేనే ఢిల్లీలో పెట్రోల్‌!

పొల్యుషన్‌ సర్టిఫికేట్‌ చూపెడితేనే ఢిల్లీలో పెట్రోల్‌!

వాయు కాలుష్యం ప్రపంచమంతటా పెరిగిపోతుంది. మన దేశ రాజధాని ఢిల్లీ  ఎప్పటి నుంచో ప్రమాదకర స్థాయి ఎయిర్ పొల్యుషన్ తో ఇబ్బంది పడుతోంది. దీంతో ఢిల్లీ ప్రభుత్వం  కఠిన నిర్ణయాలు తీసుకోవాలని నిర్ణయించింది. అందులో భాగంగా పొల్యుషన్‌ అండర్‌ చెక్‌ సర్టిఫికేట్‌ (PUCC) ఉన్న వెహికిల్స్ కే  ఫ్యూయల్‌ బంకుల్లో పెట్రోలు , డీజిల్‌ పోయాలనే చట్టం తెచ్చే యోచనలో ఉన్నట్టు ఆ రాష్ట్ర పర్యావరణశాఖ మంత్రి గోపాల్‌రాయ్‌ తెలిపారు.

ఫ్యూయల్‌ కోసం బంకుల్లోకి వచ్చే వాహనదారులు తప్పని సరిగా పొల్యుషన్‌ సర్టిఫికేట్‌ తమతో పాటు తెచ్చుకోవాలి.. లేదంటే బంకుల్లో ఉండే పొల్యుషన్‌ టెస్టింగ్‌ సెంటర్ల దగ్గరకు వెళ్లి ఈ సర్టిఫికేట్‌ పొందాల్సి ఉంటుంది. ఆ తర్వాతే పెట్రోలు లేదా డీజిల్‌ను కొనేందుకు అనుమతి ఇస్తారు. ఈ విధానం అమలులో ఉండే లోటుపాట్లు, ఇతర మార్పులు చేర్పులపై నిపుణులు, వివిధ వర్గాల ప్రజల నుంచి అభిప్రాయం సేకరిస్తోంది ఢిల్లీ సర్కార్‌.

ఢిల్లీలో ప్రమాదకరస్థాయిలో వాయు కాలుష్యం పెరిగిపోయింది, ముఖ్యంగా చలి కాలంలో అయితే దీని తీవ్రత ఎక్కువగా ఉంటోంది. ఇప్పటికే సామాజిక సంస్థలకు తోడు సుప్రీం కోర్టు కూడా ఢిల్లీలో కాలుష్యంపై ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో గాలి నాణ్యతా ప్రమాణాలు పెంచడానికి ఢిల్లీ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది.

 

మరిన్ని వార్తల కోసం...

ఆంక్షలు సండలించిన కర్నాటక ప్రభుత్వం