ఆడవాళ్లు అయినందుకే నో ప్రమోషన్

ఆడవాళ్లు అయినందుకే నో ప్రమోషన్

అన్ని రంగాల్లో ముందుకు వెళుతున్నా మహిళలకు ఇంకా వివక్ష ఎదురవుతూనే ఉంది. మన దేశంలో 85 శాతం మంది మహిళలు ఈ వివక్ష కారణంగానే ఉద్యోగాలు పొందలేక పోతున్నారు. ఒకవేళ ఉద్యోగం వచ్చినా ప్రమోషన్లు అందుకోలేకపోతున్నారని లింక్డ్ఇన్ ఆపర్చునిటీ ఇండెక్స్ స్టడీ చెబుతోంది.

 

పది మంది మహిళలు ఉద్యోగాలు చేస్తే అందులో ఏడుగురు కంటే ఎక్కువమందికి వివక్ష కారణంగా ప్రమోషన్లు రావడం లేదు. ఈ మహిళలు తల్లులైతే.. కుటుంబ బాధ్యతలుండటం,  నైట్ షిప్ట్‌‌లు చేయలేకపోవడం వల్ల వాళ్లకు ఆఫీసుల్లో ఎదిగే ఛాన్స్ పోతోంది. ఇలా  మన దేశంలో 85శాతం మంది మహిళలు ఉన్నారని, వీరంతా కెరీర్‌‌‌‌లో ఎదగలేకపోతున్నారని చేసిన సర్వేలో తేలింది. ఆఫీసుల్లో ప్రమోషన్‌‌ అందుకోవాల్సిన వాళ్లలో ఒక మహిళ, ఒక పురుషుడు ఉంటే కచ్చితంగా పురుషుడికే ప్రమోషన్ దక్కుతుంది. అంతేకాదు, ఇటు ఇల్లు, అటు ఆఫీస్ రెండు బాధ్యతలు ఒకేసారి నిర్వహిస్తున్న మహిళలు ఎంత కష్టపడుతున్నా  కెరీర్‌‌‌‌లో సక్సెస్ కాలేకపోతున్నారు.

కెరీర్ విషయంలో కుటుంబ బాధ్యతలు అడ్డు వస్తున్నట్టే కుటుంబ బాధ్యతలకు ఆఫీసులు కూడా అడ్డువస్తున్నాయి. అయినా మగవాళ్లతో సమానంగా ఆఫీసు పనులు నిర్వహిస్తున్నారు. కానీ, 63 శాతం మంది ఉద్యోగాలు చేస్తున్న మహిళలకు, 69 శాతం మంది ఉద్యోగాలు చేసే తల్లులకు ఈ ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి. ఇదంతా వివక్ష వల్లనే అనేది ఆ సర్వే సారాంశం. మగవాళ్లతో పాటే పని సమానంగా ఉంటుంది. అయినా జీతాల్లో సమానత్వం ఉండదు. ప్రమోషన్లు రావడం, టీమ్ లీడర్లను చేయడంలో సమానత్వం కనిపించడం లేదు. తమ పై స్థాయిలో ఉన్న  మగ ఆఫీసర్లతో పాటు యాజమాన్యాలు కూడా ఈ వివక్ష చూపిస్తున్నాయన్నది ఎక్కువ శాతం మంది మహిళల అభిప్రాయం. ఆఫీసుల్లోనే  కాదు ఇండస్ట్రీల్లో పనిచేసే  మహిళలపై కూడా జెండర్ ప్రభావం ఎక్కువగానే పడుతుంది. అక్కడ కూడా ఎక్కువ శాతం మహిళలు మగవాళ్లకంటే తక్కువ వేతనం అందుకుంటున్నట్టే తేలింది.