న్యూఢిల్లీ : దేశంలో ఆహార ధాన్యాలకు ఎలాంటి కొరత లేదని కేంద్ర ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ మినిస్టర్ రాంవిలాస్ పాశ్వాన్ తెలిపారు. 9 నెలలకు సరిపడ ఆహార ధాన్యాలు నిల్వ ఉన్నాయన్నారు. ఆదివారం పీటీఐకి ఇచ్చిన ఇంటర్య్వూలో ఫుడ్ కొరత రానివ్వమని చెప్పారు. రబీ సీజన్ లో వచ్చే పంటతో అవసరానికి మించి ధాన్యం ఉంటుందన్నారు. ప్రభుత్వం లాక్ డౌన్ ను పొడగించిన 81 కోట్ల మందికి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా గొధుములు, బియ్యం ఇతర ధాన్యాలు పంపిణి చేస్తామన్నారు. ఏప్రిల్ 10 నాటికి కేంద్రంలో గోడౌన్ లలో 299.45 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం, 235.33 లక్షల మెట్రిక్ టన్నుల గొధుమలు ఉన్నాయని చెప్పారు. ” ఆహార ధాన్యాలకు ఎలాంటి కొరత లేదు. రబీలో వచ్చే పంటతో రెండేళ్లకు కావాల్సినంతా ఆహార ధాన్యాలు ఉంటాయి ” అని రాంవిలాస్ పాశ్వాన్ చెప్పారు. దేశంలోని అన్ని రాష్ట్రాలతో ఆహార ధాన్యాలకు సంబంధించి ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నామన్నారు.
