Cricket World Cup 2023: టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. ఆఫ్ఘనిస్తాన్ మ్యాచుకు గిల్ దూరం

Cricket World Cup 2023: టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. ఆఫ్ఘనిస్తాన్ మ్యాచుకు గిల్ దూరం

ఈ ఏడాది అద్భుతమైన ఫామ్ లో ఉన్న టీమిండియా యువ సంచలనం శుభమన్ గిల్ వరల్డ్ కప్ లో ఆడే అవకాశం కోసం ఎదురు చూడక తప్పట్లేదు. ఈ మెగా టోర్నీకి ముందు గిల్ డెంగ్యూ బారిన పడి ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచుకు దూరమైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ నెల 11 న ఆఫ్ఘనిస్తాన్ తో జరగబోయే మ్యాచుకు కూడా గిల్ దూరమయ్యాడు.

ప్రస్తుతం గిల్ చెన్నైలోనే ఉన్నాడు. నేడు( అక్టోబర్ 9) జట్టుతో కలిసి గిల్ ఢిల్లీకి వెళ్లలేదని బీసీసీఐ స్పష్టం చేసింది. అయితే గిల్ చాలా ఫాస్ట్ గా కోలుకుంటున్నాడని ఆఫ్ఘనిస్తాన్ మ్యాచుకు మాత్రం అతడు అందుబాటులో ఉండదని తెలిపింది. ఈ మేరకు వైద్య బృందం పర్యవేక్షణలో ఉంటాడని వెల్లడించింది. దీంతో ఆఫ్ఘనిస్తాన్ మ్యాచుకు గిల్ అందుబాటులో ఉంటాడని భావించిన ఫ్యాన్స్ ని నిరాశే ఎదరైంది. గిల్ లేకపోవడం టీమిండియాకు ఎదురు దెబ్బే  అని చెప్పాలి. 

 

ఆసీస్ తో నిన్న జరిగిన వరల్డ్ కప్ తొలి మ్యాచులో గిల్ లేని స్పష్టంగా కనబడింది. గిల్ స్థానంలో వచ్చిన ఇషాన్ కిషాన్ తొలి బంతికే అనవసర షాట్ ఆడి స్టార్క్ బౌలింగ్ లో ఔటయ్యాడు. విరాట్ కోహ్లీ, రాహుల్ పోరాటం కారణంగా భారత్ గెలిచింది కానీ లేకపోతే తొలి మ్యాచులో ఓటమి తప్పేది కాదు. మరి ఈ నెల 14 న పాకిస్థాన్ తో జరిగే మ్యాచ్ గిల్ ఫేవరేట్ గ్రౌండ్ అహ్మదాబాద్ లో జరగనుంది. మరి ఈ మ్యాచులోనైనా గిల్ ఆడతాడో లేదో చూడాలి.