దసరాకి కాదు మళ్ళీ వాయిదా.. శంకర్పై మండిపడుతున్న మెగా ఫ్యాన్స్

దసరాకి కాదు మళ్ళీ వాయిదా.. శంకర్పై మండిపడుతున్న మెగా ఫ్యాన్స్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram charan) హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్(Shankar) కాంబినేషన్ లో వస్తన్న మోస్ట్ వాంటెడ్ మూవీ గేమ్ ఛేంజర్(Game changer). భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా నుండి రిలీజైన పోస్టర్స్ అండ్ వీడియోస్ సినిమాపై అంచనాలను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్తున్నాయి. అందుకే ఈ సినిమా నుండి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అవుతోంది.

ఇదిలా ఉంటే.. గత వారం రోజుల నుండి దసరా కానుకగా గేమ్ ఛేంజర్ నుండి ఏదో అప్డేట్ రానుందని ప్రచారం జరిగింది. దీంతో ఫ్యాన్స్ అంతా ఈ సినిమా నుండి ఫస్ట్ సాంగ్ రిలీజ్ కానుందని అనుకున్నారు కానీ.. తాజాగా సమాచారం ప్రకారం ఈ సినిమా నుండి దసరా కానుకగా ఎలాంటి అప్డేట్ ఉండబోదని అర్థమవుతోంది. దానికి కారణం.. గేమ్ ఛేంజర్ అప్డేట్ పై మేకర్స్ నుండి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడమే. మరో రెండురోజుల్లో దసరా పండుగా. చాలా సినిమాలు ఇప్పటికే పండుగ సందర్బంగా తమ సినిమాల అప్డేట్ పై క్లారిటీ ఇచ్చేశారు. 

Also Read : మూడింటిలో ఇదే కామన్ పాయింట్.. ఆడియన్స్ గమనించారా!?

నిజంగా గేమ్ ఛేంజర్ నుండి అప్డేట్ ఉంటే.. టీమ్ నుండి ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చేది. కానీ అలాంటిదేం రాలేదు కాబట్టి.. గేమ్ ఛేంజర్ నుండి ఎలాంటి అప్డేట్ ఉండదని క్లియర్ గా అర్థమవుతోంది. దీంతో మెగా ఫ్యాన్స్ కాస్త డిజప్పాయింట్ అవుతున్నారు. అప్డేట్స్ విషయంలో శంకర్ క్లారిటీగా ఉండటం లేదంటూ ఆయనపై మండిపడుతున్నారు.