ఆ ఊరిలో ఎవరైనా చనిపోతేఎన్ని కష్టాలో

ఆ ఊరిలో ఎవరైనా చనిపోతేఎన్ని కష్టాలో

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ములకలపల్లి మండలం జగన్నాథపురం శివారులోని నల్లివారి గూడెంలో ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు చేయడానికి కష్టాలు పడాల్సి వస్తోంది. ఊరిలో రూ. 12 లక్షలతో వైకుంఠధామం కట్టినా దారి ఏర్పాటు చేయలేదు. దీంతో పొలాలు, గట్లపై శవాన్ని మోసుకుపోవాల్సి వస్తోంది. సోమవారం గ్రామానికి చెందిన ఓ యువతి చనిపోగా శవాన్ని మోసుకుంటూ నీళ్లు నిండిన పొలాల మధ్య నుంచి వెళ్లాల్సి వచ్చింది. ఆఫీసర్లు, ప్రజాప్రతినిధుల మధ్య కో ఆర్డినేషన్​లేకపోవడంతో దారి సమస్య పరిష్కారం కావడం లేదని, ఇప్పటికైనా చొరవ చూపాలని గ్రామస్తులు కోరుతున్నారు.