గీతం యూనివర్సిటీలో..ఘనంగా జాతీయ సైన్స్‌ దినోత్సవం

గీతం యూనివర్సిటీలో..ఘనంగా జాతీయ సైన్స్‌ దినోత్సవం
  •     సైన్స్‌ ను కెరీర్‌‌గా ఎంచుకోండి 
  •     నోబెల్ బహుమతి గ్రహీత డాక్టర్ గ్రెగ్ ఎల్.సెమెంజా

రామచంద్రాపురం, వెలుగు : సైన్స్‌ ను కెరీర్‌‌గా ఎంచుకోవాలని నోబెల్‌ బహుమతి గ్రహీత డాక్టర్‌‌ గ్రెగ్‌ ఎల్‌ సెమెంజా విద్యార్థులకు సూచించారు.  సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరువు పరిధిలోని గీతం యూనివర్సిటీలో బుధవారం ‘భారతదేశ అభివృద్ధి కోసం దేశీయ పరిజ్ఞానం’ అనే ఇతి వృత్తంతో  జాతీయ సైన్స్‌ దినోత్సవం నిర్వహించారు. వివిధ ఇంటర్నేషనల్​ స్నూళ్ల నుంచి 800 మంది విద్యార్థులు పాల్గొని సందేహాలను నివృత్తి చేసుకున్నారు.

శివ్వంపేట, వెలుగు : విద్యార్థులు శాస్త్రీయ పరిజ్ఞానం పెంపొందించుకుని భవిష్యత్తు  సైంటిస్టులుగా ఎదగాలని డీఈఓ రాధాకృష్ణ అన్నారు.  బుధవారం శివ్వంపేట మండలం గూడూరు కస్తూర్బా పాఠశాలలో  నిర్వహించిన జాతీయ సైన్స్ దినోత్సవ కార్యక్రమంలో  పాల్గొని మాట్లాడారు.  జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, కేజీబీవీ ప్రిన్సిపల్‌ మంజుల ఉన్నారు. 

పుల్కల్, వెలుగు : విశ్వం రహస్యాలను ఛేదించడానికి సైన్స్ ఒక దీప స్తంభమని జేఎన్‌టీయూ కాలేజ్ ప్రిన్సిపాల్ నరసింహా అన్నారు.  సుల్తాన్ పూర్ జేఎన్టీయూ కాలేజ్‌లో సైన్స్, హ్యుమానిటీస్ విభాగం ఆధ్వర్యంలో బుధవారం సైన్స్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.  సీవీ రామన్ ఎఫెక్ట్ ఆవిష్కరణకు గుర్తుగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. 

ములుగు,వెలుగు : విద్యార్థులు చిన్నతనం నుండే ప్రయోగాలు చేస్తే శాస్త్రవేత్తలవుతారని ఎంఈఓ ఉదయ భాస్కర్ రెడ్డి, ఎస్ఐ విజయ్ కుమార్ అన్నారు.  ములుగులో స్వామి వివేకానంద విద్యాలయం కరస్పాండెంట్ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని సైన్స్ డేను నిర్వహించారు.  ప్రధానోపాధ్యాయురాలు నాగరాణి తదితరులు పాల్గొన్నారు.