నోకియా G42 సరికొత్తగా..4GB RAM, 128 GB స్టోరేజ్..ధర, ఫీచర్స్

నోకియా G42 సరికొత్తగా..4GB RAM, 128 GB స్టోరేజ్..ధర, ఫీచర్స్

నోకియా G42 5G స్మార్ట్ ఫోన్ 4GB RAM, 128 GB స్టోరేజ్ తో అతి తక్కువ ప్రారంభ ధరతో ఇండియాలో లాంచ్ అయింది. నోకియా కంపెనీ కొత్త వేరియంట్ మార్చ్ నెలాఖరులో అమ్మకాలు మొదలవుతాయి. Nokia G42 5G కొత్త 4GB +128 GB కాన్ఫిగరేషన్ ధర రూ. 9,999. 6GB+128GB ఎంపిక ప్రస్తుతం రూ. 12,999. అయితే  8GB+256GB వేరియంట్ రూ. 16,999. నోకియా  మార్చి 8 నుంచి అమెజాన్, HMD  వెబ్ సైట్ ద్వారా కొత్త వేరియంట్ ను విక్రయించనుంది. ఈ ఫోన్ సో గ్రే, సో పింక్, సో పర్పుల్ రంగుల్లో లభిస్తోంది. 

నోకియా G42 5G స్పిసిఫికేషన్లు, ఫీచర్లు

Nokia G42 5G 6.56 అంగుళా HD+ LCD స్క్రీన్ తో 90Hz రిఫ్రెషఫ్ రేట్, 560nits పీక్ బ్రైట్ నెస్ లెవెల్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ తో వస్తుంది. ఇది 8GB వరకు RAM , 256 GB వరకు ఆన్ బోర్డ్ స్టోరేజ్ తో జత చేయబడింది. ఆక్టాకోర్ Qaulcomm Snapdragon 480+ చిప్సెట్ ద్వారా ఆండ్రాయిడ్ 13 తో ఈ ఫోన్ రన్ అవుతుంది. 

కెమెరా విభాగంలో నోకియాG42 5G  బ్యాక్ సైడ్ LED ఫ్లాష్ యూనిట్ తో పాటు 50 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సార్ రెండు 2 మెగా పిక్సెల్ సెన్సార్ లను కలిగి ఉంటుంది. ముందు కెమెరా 8 మెగా పిక్సెల్ సెన్సార్ తో అమర్చబడి ఉంటుంది. 
బ్యాటరీ విషయానికొస్తే.. 5000 mAh బ్యాటరీతో 20W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ కు మద్దతునిస్తుంది. ఫోన్ 5G, GPS, బ్లూటూత్5.1, Wi-Fi, USB type C కనెక్టివిటీ కి కూడా మద్దతునిస్తుంది. డస్ట్, స్ప్లాష్ రెసిస్ెటన్స్ కోసం PI52  రేటింగ్ భద్రతకోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది.