రివ్యూ: నూటొక్క జిల్లాల అందగాడు

రివ్యూ: నూటొక్క జిల్లాల అందగాడు

రన్ టైమ్ : 2 గంటల 10 నిమిషాలు
నటీనటలు: అవసరాల శ్రీనివాస్,రుహాని శర్మ,రోహిణి,శివన్నారాయణ తదితరులు
సినిమాటోగ్రఫీ: రామ్
మ్యూజిక్ :శక్తి కాంత్ కార్తిక్
నిర్మాతలు : శిరీష్,రాజీవ్ రెడ్డి,సాయి బాబు తదితరులు
రచన: అవసరాల శ్రీనివాస్
దర్శకత్వం: రాచకొండ విద్యాసాగర్ 


కథేంటి?
గొట్టి సూర్య నారాయణ (శ్రీనివాస్ అవసరాల) కు యవ్వనంలోనే బట్టతల వచ్చేస్తుంది.దాన్ని విగ్ తో దాచేస్తాడు. వెంట్రుకలు లేకపోవడం తన మైనస్ గా భావిస్తాడు. దాని వాళ్ల తనను ఎవరు పెళ్లి చేసుకోరని బాధపడుతుంటాడు.బట్టతల ఉందన్న విషయం దాచేసి తన ఆఫీసులో పనిచేస్తున్న అంజలి (రుహాని శర్మ) ని ప్రేమిస్తాడు. చివరికి ఆమెకు నిజం ఎలా తెలిసింది.లైఫ్ లాంగ్ విగ్ తోనే కంటిన్యూ అయ్యాడా లేదా అనేది కథ.


నటీనటుల పర్ఫార్మెన్స్: 
అవసరాల శ్రీనివాస్ మరోసారి తన కామిక్ టైమింగ్ తో ఎంటర్ టైన్ చేశాడు. బట్టతల ఉండి బాధపడుతున్న వ్యక్తి పాత్రలో చక్కగా సరిపోయాడు.సినిమా అంతా తానే అయి నడిపించాడు.రైటర్ గా కూడా తన మార్కు చూపించాడు.రుహాని శర్మ  అందం,అభినయంతో ఆకట్టుకుంది. తల్లిపాత్రలో రోహిణి నటన చాలా బాగుంది.


టెక్నికల్ వర్క్ :
శక్తి కాంత్ కార్తిక్ పాటలు యావరేజ్ గా ఉన్నాయి.బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది.రామ్ సినిమాటోగ్రఫీ బాగుంది.ఎడిటింగ్ కాస్త క్రిస్ప్ గా ఉండాల్సింది. ప్రొడక్షన్ వాల్యూయ్స్ ఫర్వాలేదు. శ్రీనివాస్ అవసరాల రాసుకున్న పంచ్ డైలాగులు బాగా పేలాయి.


విశ్లేషణ:
‘‘నూటొక్క జిల్లాల అందగాడు’’ ఫన్ అండ్ క్లీన్ ఎంటర్ టైనర్. బట్టతల పాయింట్ ఉంది కాబట్టి అది ఉండి బాధపడుతున్న అందరు యువకులు కనెక్ట్ అవుతారు. దీని మీద అవసరాల శ్రీనివాస్ పండించిన కామెడీ హైలైట్. ఫస్టాఫ్ ఎంటర్ టైనింగ్ గా సాగిన ఈ సినిమా సెకండాఫ్ లో నెమ్మదించింది. కొన్ని ఎమోషనల్ సీన్ల వల్ల స్లో అయ్యింది. కొన్ని రిపిటేషన్ సీన్లు కూడా ఎక్కువయ్యాయి. అందువల్ల  కాస్త బోరింగ్ గా అనిపిస్తుంది. కథ మరీ చిన్నపాయింట్ మీద ఆధారపడటంతో ఇలా అనిపిస్తుంది. అవసరాల శ్రీనివాస్ ఈ సినిమాకు ప్రధాన బలం. ఫస్టాఫ్ ఎంటర్ టైనింగ్ గా అనిపిస్తుంది. సెకండాఫ్ జస్ట్ ఓకే అనిపిస్తుంది. హిందీ సినిమా బాల ఇన్సిపిరేషన్ తో వచ్చిన ఈ సినిమా ఫర్వాలేదనిపిస్తుంది. ఓవరాల్ గా టైమ్ పాస్ కోసం ఓసారి చూడొచ్చు.


బాటమ్ లైన్: ఈ అందగాడు ఫర్వాలేదు.