కరోనా వైరస్ సోకిన అధికారిని ఉరితీసిన ఉత్తర కొరియా

కరోనా వైరస్ సోకిన అధికారిని ఉరితీసిన ఉత్తర కొరియా

కరోనా వైరస్ వ్యాప్తి నుంచి తమ దేశ ప్రజలను కాపాడుకునేందుకు ఆయా దేశాలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. వ్యాధి లక్షణాలు ఉన్నవారికి ప్రత్యేకంగా టెస్టులు చేస్తున్నారు వైద్యాధికారులు. అయితే ఉత్తర కొరియా మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించింది. కరోనా వైరస్‌ సోకినట్లుగా భావిస్తున్న ఓ వ్యక్తిని దారుణంగా చంపేసినట్లు దక్షిణ కొరియా మీడియా  వార్తను ప్రచురించింది. ఆ దేశ అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ నియంతృత్వ పోకడలను చాటిచెప్పే ఈ ఘటనపై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కరోనా వైరస్ తమ దేశంలోకి ప్రవేశించకుండా ఉత్తర కొరియా కఠినంగా ఆంక్షలను అమలు చేస్తోంది. ఇందుకోసం సైనిక చట్టాలను కూడా అమలు చేస్తోంది. ఇటీవల చైనాకు వెళ్లి వచ్చిన ఓ అధికారికి కరోనా వైరస్ సోకిందన్న కారణంగా చంపేసింది. విధి నిర్వహణలో భాగంగా ఆ అధికారి ఇటీవల చైనాకు వెళ్లి రావడంతో ఉత్తర కొరియా అధికారులు ఆ అధికారిని మొదట నిర్బంధించారు. అయితే ఆ అధికారి ఓ పబ్లిక్ బాత్ రూంలో స్నానం చేయడానికి వెళుతున్న సమయంలో అధికారులు గుర్తించి ఉరితీసి చంపినట్లు దక్షిణ కొరియా మీడియా తెలిపింది.

అంతేకాదు చైనా నుంచి వచ్చిన వారిని, చైనా ప్రజలను నిర్బంధించాలని ఆ దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆదేశాలు జారీచేశారు. చైనాతో సరిహద్దులను మూసివేశారు. రోడ్డు మార్గాలు మూసివేయడమో లేక కఠిన నిషేధాలు అమలు చేయడమో అమలు చేస్తోంది. పర్యాటకులను నిషేధించింది. కరోనా వైరస్ చాయలు తమదేశంలోకి రాకుడదని.. దేశలో సైనిక చట్టాలను అమలు చేస్తోంది.