బైబిల్ పట్టుకున్నందుకు 2 ఏళ్ల చిన్నారికి జీవిత ఖైదు

 బైబిల్ పట్టుకున్నందుకు 2 ఏళ్ల చిన్నారికి జీవిత ఖైదు

ఉత్తర కొరియాలో చెత్త చట్టాలు..వింత, విచిత్ర నిర్ణయాలతో  అక్కడి ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. తన నియంత పాలనతో  ప్రజలను ఇష్టానుసారంగా శిక్షిస్తూ..ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ పైశాచిక ఆనందాన్ని పొందుతాడు. తాజాగా ఉత్తరకొరియాలో  రెండేళ్ల చిన్నారికి జీవితఖైదు విధించాడు కిమ్ జోంగ్ ఉన్. 

బైబిల్ చేతిలో కనిపిస్తే జైలుకే..

ఉత్తర  కొరియాలో క్రైస్తవులపై అక్కడి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. చేతిలో బైబిల్‌తో కనిపిస్తే చాలు వారిని జైల్లో పెట్టి హింసిస్తున్నారు. మొత్తం కుటుంబ సభ్యులందరికీ శిక్ష విధిస్తున్నారట. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. అంతర్జాతీయ మత స్వేచ్ఛ 2022 పేరుతో అమెరికా విదేశాంగ శాఖ ఓ రిపోర్టును  విడుదల చేసింది. ఇందులో ఉత్తరకొరియా ప్రభుత్వం అక్కడి క్రైస్తవులపై పాల్పడుతున్న దారుణాలను పేర్కొంది. ఇతర మతాల వారి పట్ల కిమ్‌ ప్రభుత్వ దాష్టికాలను వెల్లడించింది.  ఇప్పటివరకు ఉత్తర కొరియాలో 70వేల మంది క్రైస్తవులను జైల్లో వేశారని నివేదిక పేర్కొంది. ఇందులో ఓ రెండేళ్ల చిన్నారి కూడా ఉన్నట్లు వెల్లడించింది. 

రెండేళ్ల చిన్నారికి జీవిత ఖైదు..

2009లో రెండేళ్ల చిన్నారి తల్లిదండ్రులతో కలిసి  ప్రార్థన చేసుకుని బైబిల్‌ వస్తున్నాడు. దీన్ని చూసిన ఉత్తర కొరియా పోలీసులు ఆ కుటుంబాన్ని జైల్లో వేశారు.  2 ఏళ్ల చిన్నారి అని కూడా చూడకుండా ఏకంగా జీవిత ఖైదు విధించారు. కుటుంబాన్ని అరెస్ట్ చేసి జైల్లో వేసిన తర్వాత చిత్ర హింసలకు గురిచేశారు. ఇలా ఉత్తర కొరియా జైల్లో 70 వేల మంది క్రిస్టియన్లు ఉన్నారని... వీరందరికీ న్యాయం చేయాల్సిన అవసరముందని అమెరికా విదేశాంగ శాఖ  అభిప్రాయపడింది. 
 

కొరియా ఫీచర్ ప్రకారం...

2021 డిసెంబర్‌లో  కొరియా ఫ్యూచర్ ఓ రిపోర్టును రిలీజ్ చేసింది. దీని ప్రకారం ఉత్తర కొరియాలో మత స్వేచ్ఛ లేకుండా పోయింది. అక్కడి మహిళలను దారుణంగా హింసిస్తున్నారు. బాధితుల్లో 151 మందిని  ఇంటర్వ్యూ చేసి ఈ విషయాన్ని కొరియా ఫ్యూచర్ వెల్లడించింది. ఉత్తర కొరియా ప్రభుత్వ హింసను తట్టుకోలేక చాలా మంది అక్కడి నుంచి పారిపోయారని తెలిపింది. మరి కొందరు జైల్లోనే హింసను భరిస్తున్నారని పేర్కొంది.