నార్వే యువరాణి మాజీ భర్త ఆత్మహత్య

నార్వే యువరాణి మాజీ భర్త ఆత్మహత్య

స్వీడన్: ప్రముఖ రచయిత, నార్వే యువరాణి మాజీ భర్త 47 ఏళ్ల అరీ బెన్ బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. అరీ బెన్ 2002లో నార్వేజియన్ రాయల్ మెర్తా లూయిస్‌ను వివాహం చేసుకున్నాడు. వారిద్దరూ కలిసి తమ వివాహబంధం గురించి తెలుపుతూ ‘ఫ్రమ్ హార్ట్ టూ హార్ట్’ అనే పుస్తకాన్ని కూడా రాశారు. బెన్ తన మొదటి పుస్తకాన్ని 1999లో ‘సాడ్ యాస్ హెల్’ పేరుతో ప్రచురించాడు. బెన్, తన భార్యతో ఆగస్టు 2016లో విడాకులు తీసుకున్నాడు. వారికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. నార్వే ప్రధాని ఎర్నా సోల్బెర్గ్ మరియు రాజ కుటుంబంతో సహా స్నేహితులు, బంధువులు అరీ బెన్ మృతికి సంతాపం తెలిపారు. ఆరీ చాలా సంవత్సరాలుగా మా కుటుంబంలో ఒకడుగా ఉన్నాడు. మాతో అతని జ్ఞాపకాలు ఎల్లప్పుడూ ఉంటాయని రాయల్ హౌస్ ఆఫ్ నార్వే ఒక ప్రకటనలో తెలిపింది. అరీ బెన్ తన ప్రాణాలను తీసుకున్నాడని చాలా బాధతో ప్రకటిస్తున్నామని ఆయన మేనేజర్ గీర్ హకోన్సుండ్ తెలిపారు. అరీ బెన్ అనేక నవలలు మరియు నాటకాలను కూడా రాశాడు. బెన్ 2018లో తన చివరి పుస్తకం ‘ఇన్ఫెర్నో’ను ప్రచురించాడు. ఈ పుస్తకంలో బెన్ తన మానసిక ఆరోగ్య సమస్యల గురించి వివరించాడు. బెన్ రచనలలో ‘బుక్ ఆన్ మెంటల్ హీత్’ చాలా ప్రాచుర్యం పొందింది.

For More News..

పది ప్లాస్టిక్ బాటిల్స్ ఇస్తే ఒక మిల్క్ ప్యాకెట్ ఫ్రీ