ఫౌంటెన్ కాదు.. మిషన్ భగీరథ పైప్ లైన్

ఫౌంటెన్ కాదు..  మిషన్ భగీరథ పైప్ లైన్

వెలుగు, శామీర్ పేట: మేడ్చల్ జిల్లా శామీర్ పేట పెద్దచెరువు వద్ద మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలి రెండు గంటలు తాగునీరు వృథాగా పోయింది. రూ. లక్షల ప్రజా ధనాన్ని ఖర్చు చేసి వందల కిలోమీటర్ల దూరం నుంచి సిటీకి తాగునీరందించేందుకు మిషన్ భగీరథ పైపులైన్ ఏర్పాటు చేశారు. 

మజీద్ పూర్‌‌‌‌‌‌‌‌లోని క్షేత్రగిరి పంప్ హౌస్ నుంచి సిటీకి వస్తున్న ఈ  పైప్ లైన్ బుధవారం ఉదయం శామీర్ పేట పెద్ద చెరువు వద్ద పగిలిపోయింది. రాజీవ్ రహదారి పక్కనే వాటర్ ఫౌంటేన్ ను తలపించేలా నీళ్లు 20 మీటర్ల ఎత్తుకు లేచి వృథాగా పోయాయి.2 గంటల తర్వాత మెట్రోపాలిటన్ వాటర్ వర్క్స్ అధికారులు అక్కడికి చేరుకుని పైప్ లైన్ రిపేర్ పనులు చేపట్టారు.