టి డయాగ్నస్టిక్​ హబ్స్​లలో అన్ని టెస్టులు చేస్తలే

టి డయాగ్నస్టిక్​ హబ్స్​లలో అన్ని టెస్టులు చేస్తలే
  • రిపోర్టులు ఇచ్చుడూ లేటే 
  • టెక్నికల్​ ప్రాబ్లమ్స్​ అంటున్న సిబ్బంది
  • 24 గంటలు పని చేయాల్సి ఉన్నా సాయంత్రానికే బంద్​
  • ఆదివారం, పబ్లిక్​ హాలిడేస్​లో మొత్తానికి తెరుస్తలేరు 

మహబూబ్​నగర్, వెలుగు : తెలంగాణ డయాగ్నస్టిక్​హబ్​(టి -హబ్​)లు పూర్తిస్థాయిలో ఉపయోగపడ్తలేవు. గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు 57 రకాల టెస్టులను ఫ్రీగా చేయాలని ఈ సెంటర్లను స్టేట్​ గవర్నమెంట్ ​స్టార్ట్​ చేసినా, చాలా చోట్ల అన్ని పరీక్షలు చేయడం లేదు. టెస్ట్ ​రిపోర్ట్స్​మెసేజ్ కూడా ​పేషంట్ల ఫోన్ ​నంబర్లకు ఇన్​టైంలో రావడం లేదు. దీంతో శాంపిల్స్​ ఇచ్చిన వారు పీహెచ్​సీలు, సీహెచ్​సీలు, యూసీహెచ్​ఎస్​లకు వెళ్లి రిపోర్టులు తెచ్చుకోవాల్సి వస్తోంది.  

14 జిల్లాల్లో అమలు 

రాష్ర్టంలో కరీంనగర్​, జగిత్యాల, మెదక్​, ఆసిఫాబాద్​, నిర్మల్​, ఆదిలాబాద్, భదాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, మహబూబ్​నగర్​, జనగాం, మహబూబాబాద్​, ఖమ్మం, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాల్లోని గవర్నమెంట్​ హాస్పిటల్స్​లో గతేడాది నుంచి తెలంగాణ డయాగ్నస్టిక్​ హబ్​లను సర్కారు ప్రారంభించింది. మిగతా జిల్లాల్లో వీటి ఏర్పాటుకు ప్రతిపాదనలున్నాయి. మరికొన్ని జిల్లాల్లో ప్రస్తుతం బిల్డింగ్​ కన్​స్ర్టక్షన్​ వర్క్స్​ సాగుతున్నాయి. ఇప్పుడు రన్నింగ్​లో ఉన్న టి -హబ్​లకు శాంపిల్స్​ తీసుకువచ్చేందుకు ప్రతి జిల్లాకు నాలుగు నుంచి ఐదు వెహికిల్స్​ సమకూర్చారు. ప్రతి జిల్లాలోని సీహెచ్​సీ, పీహెచ్​సీ, యూసీహెచ్​ఎస్​లకు వచ్చే పేషంట్లను ముందుగా పరీక్షిస్తారు. అక్కడ వారికి టెస్టులు అవసరమైతే శాంపిల్స్​ తీసుకుని, టి హబ్​కు సంబంధించిన వెహికిల్స్ వచ్చాక ఇచ్చి పంపిస్తున్నారు. అక్కడి స్టాఫ్​ శాంపిల్స్​కలెక్ట్​ చేసుకొని టెస్టులు చేస్తారు. రిజల్ట్స్​ వచ్చాక  పేషంట్ ​సెల్​కు మెసేజ్​ రూపంలో పంపించాల్సి ఉంటుంది. కానీ, రిపోర్ట్స్​ఆన్​లైన్​లో అప్​లోడ్​ చేసే టైంలో టెక్నికల్ ​ప్రాబ్లమ్స్​ ఏర్పడుతున్నాయి. దీంతో కొందరికి మెసేజ్​లు రావడం లేదు. మరికొంతమందికి లేట్​గా వస్తున్నాయి. అత్యవసరమైనవారు డైరెక్ట్​గా శాంపిల్స్​  ఇచ్చిన సెంటర్లకే వెళ్లి రిపోర్టులు తెచ్చుకుంటున్నారు.

ఆ పది రకాల టెస్టులు చేస్తలేరు

టి- హబ్​ల ద్వారా 57 రకాల టెస్టులు చేయాల్సి ఉన్నా, చాలా చోట్ల 44 నుంచి 47 వరకు మాత్రమే చేస్తున్నారు. ఖమ్మం సెంటర్​లో 53 రకాల టెస్టులు, కరీంనగర్​లో 44 , మహబూబాబాద్​లో 47 , జనగాంలో 53 , పాలమూరులో 44 , భద్రాది కొత్తగూడెంలో 54 , ఆసిఫాబాద్​లో 45 రకాల పరీక్షలు మాత్రమే చేస్తున్నారు. థైరాయిడ్​, ఎలెక్ట్రోలైట్, సీరమ్ సోడియం, సీరమ్ పొటాషియం, సీరమ్ క్లోరైడ్, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ (సీయూఈ), స్టూల్​ టెస్టింగ్​ ఫర్​ బ్లడ్​,   కాంబస్ డైరెక్ట్, కాంబస్ ఇన్​డైరెక్ట్​, హెచ్​బీఏ1సీ, ఓరల్ గ్లుకోజ్, ఎల్డీహెచ్ టెస్టులు చేయడం లేదు.  వీటికి సంబంధించి ఎక్విప్​మెంట్​, కెమికల్స్​ అందుబాటులో లేవని, అందుకే చేయడం లేదని స్టాఫ్​ చెబుతున్నారు.  

ఈవినింగ్​ క్లోజ్​.. సండే బంద్​

సెంటర్లు 24 గంటలు పని చేస్తాయని సర్కారు చెబుతున్నా, ఫీల్డ్​లెవెల్​లో సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల్లోపే మూసేస్తున్నారు. ఆదివారాల్లో అసలే తెరవట్లేదు. పబ్లిక్​ హాలిడేస్​ టైంలోనూ ఇదే పరిస్థితి. జగిత్యాలలో ల్యాబ్ ఇన్​చార్జి ఐదు గంటల వరకు ఉంటుండగా, స్టాఫ్​ ఏడు గంటలకు క్లోజ్​ చేసి పోతున్నారు. సండే బంద్​ చేస్తున్నారు. ఆసిఫాబాద్​ సెంటర్​ను రాత్రి తొమ్మిదింటి లోపు క్లోజ్ ​చేస్తుండగా, ఆదివారం తెరవడం లేదు. నిర్మల్ ​సెంటర్​ను పది గంటలకు తెరిచి సాయంత్రం నాలుగు గంటల వరకే రన్ ​చేస్తున్నారు. ఆదిలాబాద్​లో వచ్చిన శాంపిల్స్ టెస్ట్​చేయడం ఎప్పుడైపోతే అప్పుడే మూసిపోతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం సెంటర్​కు సాయంత్రానికే తాళం వేస్తున్నారు. వైద్యారోగ్య శాఖ మంత్రి సొంత నియోజకవర్గమైన సిద్దిపేటలో టి హబ్ ​సెంటర్​ను సండేస్​తో పాటు పబ్లిక్​ హాలిడేస్​లో కూడా తెరవడం లేదు. పాలమూరులో పది రోజుల కిందటి వరకు ఐదు గంటలకే బంద్​ పెట్టగా, ఇటీవల హెల్త్​ మినిస్టర్​24 గంటలూ తెరిచే ఉంచాలని ఆదేశించారు. దీంతో సిబ్బంది అదనంగా రెండు గంటలు ఉండి ఏడు గంటలకే వెళ్లిపోతున్నారు. కరీంనగర్​, మహబూబాబాద్​ సెంటర్లలో సండే హాలీడే పాటిస్తుండగా, ఖమ్మం సెంటర్​లో రాత్రి తొమ్మిదింటికి తాళం వేస్తున్నారు. ఎక్కువ సెంటర్లలో ఏడు గంటల తర్వాత వచ్చే శాంపిల్స్​ను పరీక్షించడం లేదు. టెక్నీషియన్లు మరుసటి రోజు వచ్చి టెస్ట్​ చేస్తున్నారు. దీంతో లేట్ అవుతుండడంతో అత్యవసరమైన వారు మళ్లీ ప్రైవేట్​ ల్యాబ్​లనే ఆశ్రయిస్తున్నారు.

వనపర్తి లో టెస్టులే చేయట్లే  

వనపర్తిలో టి-హబ్​ సెంటర్​లో అసలు టెస్టులే చేయడం లేదు. ఈ జిల్లా పరిధిలోని పీహెచ్​సీలు, సీహెచ్​సీల నుంచి వచ్చే కొన్ని శాంపిల్స్​ను పక్కనే ఉన్న జోగుళాంబ గద్వాల జిల్లా సెంటర్​కు పంపిస్తున్నారు. అక్కడ సిబ్బంది వీటిని పరీక్షించి, రిపోర్టులు ఆన్​లైన్​లో అప్​లోడ్​ చేసేసరికి మూడు రోజులు పడుతోంది. వనపర్తి జిల్లాలో ఈ సెంటర్​ను ప్రారంభించినప్పటి నుంచి ఇదే సమస్య వెంటాడుతోంది. సిబ్బంది కొరతతో ఇక్కడ టి-హబ్​ సేవలు ప్రజలకు అందుబాటులోకి రావడం లేదు. ఇటీవల 104 సేవలను గవర్నమెంట్​ రద్దు చేయగా, వాటిలో పని చేస్తున్న ల్యాబ్​ టెక్నిషీయన్లను ఇతర చోట్ల అలాట్​ చేస్తామని చెప్పినా, ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. నిర్మల్ 
టి -హబ్​లో సిబ్బంది కొరత ఉంది