బస్సులు నడిపిస్తలేరని రైళ్లను అడ్డుకున్నరు

బస్సులు నడిపిస్తలేరని రైళ్లను అడ్డుకున్నరు

ముంబై: బస్సు సర్వీసులు నిలిపేయడంతో ఆగ్రహించిన ప్యాసెంజర్లు దగ్గర్లోని రైల్వేస్టేషన్‌‌కు వెళ్లి అక్కడ రైళ్లను నిలిపేశారు. పట్టాలపై నిల్చొని 2 గంటల పాటు నిరసన తెలిపారు. మహారాష్ట్రలోని పాల్ఘర్ ‌‌జిల్లాలో బుధవారం ఈ సంఘటన జరిగింది. సుమారు 200 మంది ప్యాసింజర్లు బుధవారం పొద్దున నాలసపోరా బస్‌‌స్టాండ్‌‌కు వెళ్లారు. అక్కడ బస్సులు నడుస్తలేవని తెలియడంతో కోపంతో దగ్గర్లోని నాలసపోరా రైల్వేస్టేషన్‌‌కు 8 గంటల ప్రాంతంలో వెళ్లారు. అక్కడ రైల్వేట్రాక్‌‌పై నిల్చొని నిరసన తెలిపారు.

దీంతో లోకల్‌ రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు కల్పించుకొని బస్సులను స్టార్ట్ ‌చేయించడంతో పరిస్థితి సద్దుమణిగింది. అత్యవసర సర్వీసులకు చెందిన ఉద్యోగుల కోసమే ముంబైలో లోకల్ ‌రైలు సర్వీసులనుప్రారంభించారని, నిరసన తెలిపిన వాళ్లంతా వేరే ప్రైవేట్ ‌‌ఉద్యోగులని రైల్వే పోలీసులు చెప్పారు. కాగా, ముంబైకి సర్వీసులను ఎంఎస్‌‌ఆర్సీటీ బుధవారం పొద్దున అకస్మాత్తుగా నిలిపేసింది..

మ‌రిన్ని వార్త‌ల కోసం