లాక్ డౌన్ సరిపోవు..కరోనాపై అటాక్ చేయాలి

లాక్ డౌన్ సరిపోవు..కరోనాపై అటాక్ చేయాలి

కరోనా వైరస్ ను అంతం చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు లాక్ డౌన్ అయిపోయాయి. అన్ని దేశాల ప్రభుత్వాలూ కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. అయితే, లాక్ డౌన్లు, ఇప్పుడు అమలు చేస్తున్న కఠిన చర్యలు మాత్రమే సరిపోవని, కరోనా వైరస్ ను అంతం చేయాలంటే దానిపై అటాక్ చేయాల్సిందేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రియేసస్ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. ‘‘అన్ని దేశాల్లో జనాల కదలికలను నియంత్రిస్తున్నారు. దీనివల్ల హాస్పిటళ్లపై కొంత ఒత్తిడి తగ్గుతుంది. లాక్ డౌన్ల వల్ల ఒకరకంగా ఇప్పుడు అన్ని దేశాలకు కరోనాపై పోరాటానికి రెండో అవకాశం దొరికింది. ఈ టైంను సద్వినియోగం చేసుకుని వైరస్ పై అటాక్ చేయండి. ఇప్పుడు వైరస్ బారిన పడిన ప్రతి ఒక్కరినీ గుర్తించేందుకు విస్తృతంగా టెస్టులు చేయండి. అనుమానితులను ఐసోలేట్ చేయడం, వేగంగా టెస్టులు చేయడం, సమర్థంగా ట్రీట్ మెంట్ చేయడం, ఆ తర్వాత పేషెంట్ల విషయంలో బాగా కేర్ తీసుకోవడం వంటి చర్యల ద్వారా వైరస్ పై అటాక్ చేయండి’’ అని ఆయన ప్రపంచ దేశాలకు సూచించారు. ఇంటిటికీ తిరిగి అందరి వివరాలు సేకరించాలన్నారు.

కరోనా భయంతో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని జైలు నుంచి రిలీజ్