
ప్రపంచ దేశాలు కరోనా వైరస్ తో ఉక్కిరి బిక్కిరి అవుతున్నా..తమదేశంలో మాత్రం ఒక్క కరోనా కేసు నమోదు కాలేదని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ స్పష్టం చేశారు. ఉత్తర కొరియా అధికార పార్టీ వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా స్థాపించి 75ఏళ్ల సంవత్సరాలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన మిలట్రీ పరేడ్ లో పాల్గొన్న కిమ్..దేశ ప్రజల్ని అభినందించారు. ప్రపంచ దేశాలు కరోనాతో ఇబ్బంది పడుతుంటే దక్షిణ కొరియాలో ఒక్కరంటే ఒక్కరికి కూడా కరోనా సోకలేదు. ఎవరూ మరణించలేదన్నారు. కానీ ప్రతీ ఒక్కరూ కరోనా నియంత్రణ చర్యలు తప్పనిసరిగా పాటించాలని దేశ ప్రజలను ఉద్దేశించి కిమ్ జంగ్ కోరడం కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఉత్తర కొరియాలో ఒక్కరికి కూడా కరోనా సోకలేదంటూ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తాజాగా స్పష్టం చేశారు.