ట్రంప్ ఈవెంట్లలో కరోనా కేర్​ తీసుకోవట్లే

ట్రంప్ ఈవెంట్లలో కరోనా కేర్​ తీసుకోవట్లే

వాషింగ్టన్: కరోనా విషయంలో అమెరికా ప్రెసిడెంట్​ డొనాల్డ్​ ట్రంప్​ తీరుపై హెల్త్​ ఎక్స్​పర్ట్స్​ ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఆయన పాల్గొంటున్న మీటింగ్స్​లో మాస్కులు పెట్టుకోకపోవడం, ఫిజికల్​ డిస్టెన్స్​ పాటించకపోవడంతో వైరస్​ ఇతరులకు సోకే డేంజర్​ ఉందంటున్నారు. శుక్రవారం వైట్​హౌస్​ లాన్​లో నిర్వహించిన రిపబ్లికన్​ పార్టీ కన్వెన్షన్​ ఈవెంట్​తో విమర్శలు మరింత పెరిగాయి. దాదాపు 1,500 మంది పాల్గొన్న ఈ ఈవెంట్​లో ఎక్కువ శాతం మంది మాస్కులు పెట్టుకోలేదు. సీటింగ్​ విషయంలో కూడా కరోనా రూల్స్​ ఫాలో కాలేదు. కనీసం ఒక్కొక్కరి మధ్యా 6 అడుగుల దూరం పాటించాల్సి ఉండగా.. కొన్ని అంగుళాల దూరం కూడా వదల్లేదు. రిపబ్లికన్​ పార్టీ ప్రెసిడెంట్​ క్యాండిడేట్​గా పోటీ చేసేందుకు ట్రంప్​ ఈ ఈవెంట్​లోనే ఓకే చెప్పారు. మీటింగ్​కు వచ్చిన పబ్లిక్​ హెల్త్​ ప్రొఫెషనల్స్ మాత్రమే మాస్కులు పెట్టుకున్నారు. దీనిపై విమర్శలు రావడంతో అధికారులు స్పందించారు. పార్టీ కన్వెన్షన్​లో సేఫ్టీ ప్రొటోకాల్స్​ను అమలు చేశామన్నారు. మీటింగ్​కు ముందు థర్మల్ స్క్రీనింగ్ చేశామని తెలిపారు.  శుక్రవారం రాత్రి న్యూహ్యాంప్​షైర్​లో ట్రంప్​ హాజరైన ఈవెంట్​లో కూడా చాలామంది మాస్క్​పెట్టుకోలేదు. ‘‘ఇప్పటికే చాలా మందికి వైరస్​ వచ్చింది. ఎలాంటి లక్షణాలు కనిపించకపోవడంతో ఆ విషయం వాళ్లక్కూడా తెలియదు. కానీ వీరి నుంచి వేరే వారికి వైరస్​ సోకే ప్రమాదం ఉంది”అని జార్జ్​ వాషింగ్టన్​ వర్సిటీ ప్రొఫెసర్ చెప్పారు