చైనాను చూసి నేర్చుకోండి.. ఏదీ ఫ్రీగా ఇవ్వకూడదు : ఇన్ఫోసిస్ నారాయణమూర్తి

చైనాను చూసి నేర్చుకోండి.. ఏదీ ఫ్రీగా ఇవ్వకూడదు : ఇన్ఫోసిస్ నారాయణమూర్తి

ఇన్ఫోసిస్.. ప్రపంచంలోనే టాప్ టెక్ కంపెనీల్లో ఒకటి.. ఇండియాలో నెంబర్ వన్ ఐటీ కంపెనీ.. ఇటీవల కాలంలో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు అయిన నారాయణమూర్తి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. మొన్నటికి మొన్న వారానికి 70 గంటలు పని చేయాలన్న ఆయన.. ఇప్పుడు చేసిన మరో కామెంట్స్ చర్చనీయాంశం అయ్యాయి.. అవేంటో చూద్దామా..

చైనా.. ఇండియా ఒకలే ఉంటాయి.. ఇండియాలో ఉన్న ప్రతి సమస్య చైనాలో కూడా ఉంది.. అయినా చైనా మన కంటే ఆదాయంలో.. వృద్ధిలో.. ఉద్యోగ కల్పనలో.. ఉపాధి కల్పనలో ఆరు, ఏడు రెట్లు ముందుంది.. అవే సమస్యలు ఉన్నప్పుడు చైనా దేశం అలా ఎందుకు ఉంది.. ఇండియా ఎందుకు అలా ఉంది అనేది ఆలోచించుకోవాలి.. ఏదీ ఉచితంగా ఇవ్వకూడదు.. ఏదీ ఫ్రీగా రాదు అనే విషయాన్ని గుర్తించి పాలకులు పని చేయాలి..

ఫ్రీగా ఇవ్వటం కంటే పని కల్పించటం ద్వారానే.. చైనా దేశం మనకంటే ఎంతో ముందు ఉంది.. మనకు వాళ్లకు తేడా ఇదే.. ఈ విషయంలో చైనా అమలు చేస్తు్న్న విధానాలను.. చాలా సూక్ష్మంగా అధ్యయనం చేయాల్సిన అవసరం మన పాలకులు చేయాలి అంటూ ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి..