ఆ రెండు సెల్ ఫోన్లు తీసుకురండి: ప్రభాకర్ రావుకు మరోసారి నోటీసులు

ఆ రెండు సెల్ ఫోన్లు తీసుకురండి: ప్రభాకర్ రావుకు మరోసారి నోటీసులు

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు ప్రభాకర్ రావుకు పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. 2025, జూన్ 11న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ సారి విచారణకు వచ్చేటప్పుడు గతంలో వాడిన రెండు సెల్ ఫోన్లు తీసుకురావాలని ఆదేశించారు. గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఉప ఎన్నికల సమయంలో వాడిన సెల్ ఫోన్లు అందజేయాలని కోరారు. రెండు సెల్ ఫోన్లతో పాటు ప్రభాకర్ రావు వాడిన లాప్ టాప్, మ్యాక్ బుక్ తీసుకురావాలని ఆదేశించింది సిట్. 

ALSO READ | ప్రణీత్ రావ్, శ్రవణ్ రావుతో తరచు ఎందుకు భేటీ అయ్యేవారు..? ప్రభాకర్ రావుపై సిట్ ప్రశ్నల వర్షం

కాగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు సోమవారం (జూన్ 9) పోలీసుల విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‎లో దాదాపు 8 గంటల పాటు ప్రభాకర్ రావును విచారించిన పోలీసులు.. ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ప్రభాకర్ రావు విచారణ మొత్తాన్ని వీడియో రికార్డింగ్ చేశారు. ఇవాళ్టి విచారణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు ప్రణీత్ రావుతో సంబంధాలతో పాటు ఎస్ఐబీ చీఫ్‎గా కార్యకలాపాలపై ప్రభాకర్ రావును విచారించారు.

ఎస్ఐబీలోని హార్డ్ డిస్క్‎ల  ధ్వంసం తో పాటు డాటా మాయంపై ప్రశ్నించారు. కొన్ని దశాబ్దాలుగా స్టోర్ చేసిన ఉగ్రవాద, తీవ్రవాద సమాచార మాయంపై ఆరా తీశారు. ప్రణీత్ రావుకి హార్డ్ డిస్క్‎లను ధ్వంసం చేయమని ఎవరు చెప్పారని ప్రశ్నించారు. పాత హార్డ్ డిస్క్‎లు తీసి కొత్త హార్డ్ డిస్క్‎లు ఎవరు చెప్పారంటూ ప్రభాకర్ రావుపై సిట్ అధికారులు ప్రశ్నలు వర్షం కురిపించారు.