హమ్మయ్య... గట్టెక్కిన జొకోవిచ్‌‌‌‌‌‌‌‌

హమ్మయ్య...  గట్టెక్కిన జొకోవిచ్‌‌‌‌‌‌‌‌

న్యూయార్క్‌‌‌‌‌‌‌‌: సెర్బియా లెజెండ్‌‌‌‌‌‌‌‌ నొవాక్‌‌‌‌‌‌‌‌ జొకోవిచ్‌‌‌‌‌‌‌‌ యూఎస్‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌ గ్రాండ్‌‌‌‌‌‌‌‌స్లామ్‌‌‌‌‌‌‌‌ టోర్నీలో ప్రిక్వార్టర్స్‌‌‌‌‌‌‌‌ చేరేందుకు చెమటోడ్చాడు. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన మెన్స్‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌ మూడో రౌండ్‌‌‌‌‌‌‌‌లో రెండు సెట్లు కోల్పోయిన తర్వాత గొప్పగా పుంజుకున్న నొవాక్‌‌‌‌‌‌‌‌ 4–6, 4–6, 6–1, 6–1, 6–3తో తమ దేశానికే చెందిన లాస్లో జెరెపై కష్టపడి గెలిచాడు. మూడున్నర గంటల పాటు సాగిన ఈ పోరులో రెండో సీడ్‌‌‌‌‌‌‌‌ జొకో 12 ఏస్‌‌‌‌‌‌‌‌లు కొట్టి ఏడు బ్రేక్‌‌‌‌‌‌‌‌ పాయింట్లు సాధించాడు. ప్రిక్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లో అతను క్రొయేషియా క్వాలిఫయర్‌‌‌‌‌‌‌‌ బోర్నా  గొజోతో పోటీ పడనున్నాడు. 

మూడో రౌండ్‌‌‌‌‌‌‌‌ ఇతర మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో తొమ్మిదో సీడ్‌‌‌‌‌‌‌‌ టేలర్‌‌‌‌‌‌‌‌ ఫ్రిట్జ్‌‌‌‌‌‌‌‌ (అమెరికా) 6–1, 6–2, 6–0తో మెన్సిక్‌‌‌‌‌‌‌‌ (చెక్‌‌‌‌‌‌‌‌)ను, పదో సీడ్‌‌‌‌‌‌‌‌ తియఫో (అమెరికా) 4–6, 6–2, 6–3, 7–6 (8/6)తో మనారియా (ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌)ను ఓడించి ప్రిక్వార్టర్స్‌‌‌‌‌‌‌‌ చేరారు. విమెన్స్‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌లో నాలుగో సీడ్‌‌‌‌‌‌‌‌ ఎలెనా రిబకినాకు మూడో రౌండ్‌‌‌‌‌‌‌‌లోనే చుక్కెదురైంది. 30వ సీడ్‌‌‌‌‌‌‌‌ సొరాన సిర్‌‌‌‌‌‌‌‌స్టెయా (రొమేనియా) 6–3, 6–7 (6/8), 6–4తో రిబకినా (కజకిస్తాన్‌‌‌‌‌‌‌‌)కు షాకిచ్చింది. ఆరో సీడ్‌‌‌‌‌‌‌‌ కొకో గాఫ్‌‌‌‌‌‌‌‌ (అమెరికా) 3–6, 6–3, 6–3తో ఎలైస్‌‌‌‌‌‌‌‌ మెర్టెన్స్‌‌‌‌‌‌‌‌ (బెల్జియం) ను ఓడించగా.. 15వ సీడ్‌‌‌‌‌‌‌‌ బెన్సిచ్‌‌‌‌‌‌‌‌ (స్విట్జర్లాండ్‌‌‌‌‌‌‌‌ ) 7–6 (7/1), 2–6, 6–3తో జు లిన్‌‌‌‌‌‌‌‌ (చైనా)పై, కరోలినా వోజ్నియాకి (డెన్మార్క్) 4–6, 6–3, 6–1తో బ్రాడీ (అమెరికా)పై నెగ్గి ముందంజ వేశారు.